ఇండోనేషియాలో భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
Actor ProfilePolitician

ఇండోనేషియాలో భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
ఎర్రకోటలో తొలిసారి పూర్తిగా వందేమాతరం గేయం
Andhra Jyothy22 Dec 2026
ఎర్రకోటలో తొలిసారి పూర్తిగా వందేమాతరం గేయం

దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దేశ చరిత్రలో తొలిసారి ఎర్రకోటపై అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఢిల్లీ, ఆగస్టు 15: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర వేడుకలు అంగరంగ

ఇండోనేషియాలో భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
Andhra Jyothy21 Dec 2026
ఇండోనేషియాలో భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపంలో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై దీని తీవ్రత 7.7గా నమోదయింది. జకార్తా, ఆగస్టు 15: ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపంలో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై దీని తీవ్రత 7.7గా నమోదయింది. దీంతో తూర్పు నుసా తెంగారాలోని కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దాదాపు గంటన్నర వ్యవధిలో ఐదుసార్లు భూప్రకంపనలు సంభవించాయని వివరించింది. దీంతో జనం భయంతో ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీసినట్లు తెలిపింది. ఎండే నగరానికి 68 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. మరో వైపు సముద్రంలోని కెరటాలు భారీ ఎత్తున ఎగసిపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల నుంచి దూరంగా వెళ్లిపోవాలని ప్రజలను ప్రభుత్వ అధికారులు ఆదేశించారు. ఆస్తి, ప్రాణ నష్టంపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు

ఇ డ న ష య ల భ ర భ క ప భయ త పర గ ల త స న జన Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in