ఇంటింటా జాతీయ జెండాను ఎగరేయండి
Actor ProfilePolitician

ఇంటింటా జాతీయ జెండాను ఎగరేయండి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇంటింటా జాతీయ జెండాను ఎగరేయండి
Eenadu23 Nov 2026
ఇంటింటా జాతీయ జెండాను ఎగరేయండి

దిల్లీ: మన జాతీయ పతాకం దేశానికి గర్వకారణమని, ‘హర్‌ ఘర్‌ తిరంగా’ (ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం) కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం మనకు నిరంతర ప్రేరణ శక్తి అని పేర్కొన్నారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం నాడు కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని 2022 నుంచి ప్రభుత్వం ‘హర్‌ ఘర్‌ తిరంగా’ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈసారీ జాతీయ జెండాను ఎగురవేసి.. వికసిత భారత్‌కు మన ఉమ్మడి కట్టుబాటును చాటుదామని మోదీ కోరారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నవారు కనబరిచిన ధైర్యసాహసాలు భారతీయుల్లో ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ గుర్తుండిపోతాయని మోదీ కొనియాడారు. 1942 ఆగస్టు 9న మహాత్మా గాంధీ నేతృత్వంలో మొదలైన ఉద్యమం మన దేశ స్వాతంత్య్ర పోరాటానికి నిర్ణయాత్మక ప్రేరణను ఇచ్చిందని గుర్తు చేసుకున్నారు. కాసర్‌గోడ్‌: తమ రాష్ట్రంలో వందేమాతర గీతాన్ని పూర్తిగా పాడబోమని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కె.మురళీధరన్, కాంగ్రెస్‌ ఎంపీ రాజ్‌మోహన్‌ ఉన్నిథాన్‌ స్పష్టం చేశారు. గతంలో మాదిరిగానే గీతంలోని మొదటి రెండు చరణాలనే పాడతామని తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు