ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదు
Actor ProfilePolitician

ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదు
Eenadu24 Jan 2027
ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదు

మాట్లాడుతున్న వరంగల్‌ డీసీసీ అధ్యక్షుడు ఆయూబ్‌ చిత్రంలో ఎమ్మెల్యే నాగరాజు రంగంపేట, న్యూస్‌టుడే: పది పార్టీలు మారినోళ్లు కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తారా?, సుస్మితకు ఏ అర్హత ఉంది పార్టీ పెద్దల గురించి మాట్లాడటానికి?, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేసినంత మాత్రనా పెద్ద నాయకులు అవుతారా? అని వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎండీ.ఆయూబ్‌ ప్రశ్నించారు. గురువారం వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రి కూడలిలో విలేకరుల సమావేశంలో ఆయూబ్‌ మాట్లాడారు. సీఎంపైన ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. కొండా దంపతులకు కాంగ్రెస్‌ అనేక అవకాశాలు కల్పించిందని, సుస్మిత కాంగ్రెస్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. గత పదేళ్ల భారాస పాలనలో వరంగల్‌ తూర్పులో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, నామినేటెడ్‌ పదవులు అనర్హులకు ఇవ్వడం ఎంత వరకు పద్ధతి అని నిలదీశారు. ఏమైనా సమస్యలుంటే అధిష్ఠానం పెద్దలను కలిసి మాట్లాడాలి?, బహిరంగంగా ఇష్టానుసారంగా మాట్లాడితే కార్యకర్తలు తగిన బుద్ధి చెబుతారన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు మాట్లాడుతూ.. సుస్మిత పరిధి దాటి మాట్లాడారని, సంచలన వ్యాఖ్యలు చేస్తే పెద్ద లీడర్‌ అవుతారనుకోవడం సరికాదన్నారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి అనుచితంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. సుస్మిత తీరు మార్చుకోవాలి అన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఇష ట న స ర గ మ ట ల డ త ఊర క న ద ల ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in