ఇరుముడి' సెన్సార్ రివ్యూ.. ఈ సారి రవితేజ పక్కా హిట్
Actor ProfileActor

ఇరుముడి' సెన్సార్ రివ్యూ.. ఈ సారి రవితేజ పక్కా హిట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇరుముడి' సెన్సార్ రివ్యూ.. ఈ సారి రవితేజ పక్కా హిట్
10TV Telugu13 Jan 2027
ఇరుముడి' సెన్సార్ రివ్యూ.. ఈ సారి రవితేజ పక్కా హిట్

Irumudi Censor Report : రవితేజ, ప్రియభవాని శంకర్ జంటగా నటించిన సినిమా ఇరుముడి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో డివోషనల్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా అనౌన్న్ చేసిన దగ్గర్నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. సినిమాలో రెండు అయ్యప్ప స్వామి పాటలు ఉండటం, అందులో ఒకటి ఫేమస్ మల్లెపూల పల్లకి సాంగ్ కావడంతో అయ్యప్ప భక్తులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. వరుస ఫ్లాప్స్ తో ఉన్న రవితేజకు ఈ సినిమా ఊరట ఇస్తుంది అని అంతా నమ్ముతున్నారు. రిలీజ్ కి ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ తో ఇరుముడి ప్రేక్షకులకు సినిమా చూడాలి అనే ఉత్సుకతను పెంచింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో సెన్సార్ రిపోర్ట్ వైరల్ గా మారింది. సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా యాక్షన్ కాస్త ఎక్కువ ఉండటంతో సెన్సార్ యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా నిడివి 2 గంటల 25 నిమిషాలుగా ఫైనల్ చేసారు. ఈ సినిమాలో అరటిపళ్ళ బిజినెస్ చేస్తూ, మందు అలవాటు ఉన్న హీరో కూతురు కోసం అయ్యప్ప మాల వేసి 41 రోజులు నిష్టగా ఉంటాడు. సాఫీగా సాగిపోతున్న హీరో జీవితంలోకి ఓ సమస్య వస్తుంది. తన కూతురు చదివే స్కూల్ లో ఆడ పిల్లలు చనిపోవడం, తన కూతురుకు కూడా సమస్య ఎదురవడంతో తిరగబడతాడు. కానీ ఎప్పట్లాగే అయ్యప్ప మాల వేసిన తర్వాత శత్రువులు హీరో మీదకు వస్తే ఏం చేసాడు? అతని జీవితం ఎలా మారింది? అక్కడ ఆడ పిల్లలకు వచ్చిన సమస్య ఏంటి.. అనే కథాంశంతో సస్పెన్స్ డివోషనల్ థ్రిల్లర్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ సినిమా సాగిందని సమాచారం. ఫస్ట్ హాఫ్