ఇరుముడి' మాస్ జాతర... కర్పూర హారతులు
Actor ProfileActor

ఇరుముడి' మాస్ జాతర... కర్పూర హారతులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇరుముడి' మాస్ జాతర... కర్పూర హారతులు, డ్యాన్సులతో దద్దరిల్లుతున్న థియేటర్లు
Samayam Telugu26 Jan 2027
ఇరుముడి' మాస్ జాతర... కర్పూర హారతులు, డ్యాన్సులతో దద్దరిల్లుతున్న థియేటర్లు

స్టార్ హీరో రవితేజ , సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మించిన డివోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్ ' ఇరుముడి '. టీజర్, ట్రైలర్లతోనే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం నేడు (ఆగస్టు 21) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది.* ఒక ఆడదాని చుట్టూ 40 మంది మగాళ్లు... ఐటెమ్ సాంగ్స్‌తో ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం - సిద్ధార్ధ్సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఒక భావోద్వేగ ప్రయాణాన్ని అనుభవిస్తున్నారు. ముఖ్యంగా థియేటర్ల వద్ద అభిమానుల సంబరాలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. వెండితెరపై రవితేజ అయ్యప్ప స్వామి మాలధారణలో కనిపించే సన్నివేశాలు రాగానే థియేటర్లు 'స్వామియే శరణం అయ్యప్ప' అనే నామస్మరణతో మార్మోగిపోతున్నాయి. భక్తి పారవశ్యంతో అభిమానులు స్క్రీన్ల వద్దకు వెళ్లి నేరుగా కర్పూర హారతులు పడుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం పూజలతోనే ఆగకుండా, సినిమాలో ఎంతో ప్రాధాన్యత కలిగిన 'మల్లెపూల పల్లకి' పాట, దాని వెనుక వచ్చే యాక్షన్ బ్లాక్ సమయంలో థియేటర్లలో ప్రేక్షకులు పూనకం వచ్చినట్లు ఊగిపోతూ స్క్రీన్ల ముందే డ్యాన్సులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.* రవితేజ ‘ఇరుముడి’ ట్విట్టర్ రివ్యూ... మాస్ మహరాజా ఈసారి గట్టిగా కొట్టాడా?కథ విషయానికి వస్తే.. మద్యపాన వ్యసనంలో కూరుకుపోయిన ఒక సాధారణ తండ్రి, తన ప్రాణ సమానమైన కూతురి ప్రేమ, నమ్మకాన్ని తిరిగి దక్కించుకోవడం కోసం పవిత్రమైన అయ్యప్ప దీక్షను స్వీకరిస్తాడు. అయితే దీక్షా సమయంలోనే ఊరిలోని అమాయక ఆడపిల్లల రక్షణ కోసం ఆ తండ్రి ఎదుర్కొన్న సవాళ్లు, చేసిన పోరాటం చుట్టూ కథ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. తన రెగ్యులర్ మాస్ చిత్రాల