ఇరుముడి మూవీ రివ్యూ... రవితేజకి ఎట్టకేలకు హిట్ పడిందా
Actor ProfilePolitician

ఇరుముడి మూవీ రివ్యూ... రవితేజకి ఎట్టకేలకు హిట్ పడిందా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇరుముడి మూవీ రివ్యూ... రవితేజకి ఎట్టకేలకు హిట్ పడిందా
Asianet News Telugu26 Jan 2027
ఇరుముడి మూవీ రివ్యూ... రవితేజకి ఎట్టకేలకు హిట్ పడిందా

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన మూవీ `ఇరుముడి`. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటించింది. సాయికుమార్‌, బేబీ నక్షత్ర, రమేష్‌ ఇందిరా, స్వసికా విజయ్‌, మీసాలా లక్ష్మణ్‌, అజయ్‌ ఘోష్‌ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని నిర్మించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం(ఆగస్ట్ 21) న విడుదలైంది. వరుస పరాజయాల్లో ఉన్న రవితేజకి హిట్‌ పడిందా? సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. పొల్లూరు విలేజ్‌లో త్రినాథ్‌(రవితేజ), తన భార్య కావేరి(ప్రియా భవానీ శంకర్‌), కూతురు మణియమ్మ(బేబీ నక్షత్ర)తో హ్యాపీ లైఫ్‌ని లీడ్‌ చేస్తుంటాడు. ఆయనకు ఆటో ఉంటుంది. అరటితోటని నిర్వహిస్తున్నారు. త్రినాథ్‌ ప్రతిఏడాది అయ్యప్ప మాల వేస్తుంటాడు. ఆ సమయంలో నిబద్ధతతో ఉంటాడు. మందుకు దూరంగా ఉంటాడు. కానీ మాల అయిపోయిందంటే వరుసగా తాగుతూనే ఉంటాడు. తనకు కూతురు అంటే ప్రాణం. ఆ దేవుడే కూతురు రూపంలో వచ్చాడని భావిస్తాడు. గారాభంగా పెంచుతాడు. తను ఊర్లో ఏం జరిగినా చూసింది చూసినట్టు చెబుతుంది. ఆ ఊరికి బస్‌ లేకపోవడంతో ఎమ్మెల్యే(రమేష్‌ ఇందిరా).. గురుస్వామి(సాయికుమార్‌) రిక్వెస్ట్ మేరకు బస్‌ వేయిస్తాడు. దీంతో ఊర్లో అమ్మాయిలు వేరే ఊరికి వెళ్లి హైస్కూల్‌ చదువుకుంటారు. అయితే సడెన్‌గా ఒక అమ్మాయి చనిపోతుంది. ఆ తర్వాత బస్‌లో అమ్మాయిలను కొందరు కుర్రాళ్ల వేధించడంతో మణియమ్మ చెబుతుంది. వారిని చితకబాదుతాడు త్రినాథ్‌. గురుస్వామి కూతురు గాయత్రి పదో క్లాస్‌ చదువుతుంది. ఆమెకి మెరిట్‌ స్టూడెంట్‌ అని టీచర్‌ స్పెషల్‌ క్లాస్‌లు చెబుతుంది. అంతకు ముందే ఆ టీచర్‌ ఒక అమ్మాయిని చితకబాదినందుకు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె మళ్లీ రావడంతో స్టూడెంట్స్ భయపడుతుంటారు. గాయత్రి కూడా భయపడుతుంది. ఎక్స్ ట్రా క్లాస్‌ లు అని గాయత్రిని ఇంటికి పిలిపించుకుంటుంది. మరి ఇంటికి పిలిపించి ఆ టీచర్‌ ఏం