ఇరుముడి’కి.. చాలా అవార్డులు వస్తాయి
Actor ProfileActor

ఇరుముడి’కి.. చాలా అవార్డులు వస్తాయి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇరుముడి’కి.. చాలా అవార్డులు వస్తాయి
Chitrajyothy19 Jan 2027
ఇరుముడి’కి.. చాలా అవార్డులు వస్తాయి

రవితేజ ‘ఇరుముడి’పై సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇరుముడి’ (Irumudi) చిత్రానికి చాలా అవార్డులు వస్తాయని సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ (GV Prakash Kumar) అన్నారు. ఎన్నో ప్రేమకథా చిత్రాలకు వినసొంపైన మెలోడీలు ఇచ్చి మ్యూజిక్‌ ప్రియులకు చేరువైన ఆయన, సంగీతం అందించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్‌ నిర్మించిన చిత్రమిది. ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు జీవీ ప్రకాశ్‌కుమార్‌. ‘నేను ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో ‘ఇరుముడి’ చాలా ప్రత్యేకం. ఇదో ఇంటెన్స్‌ థ్రిల్లర్‌. దర్శకుడు శివ నిర్వాణ ఈ కథ చెప్పినప్పుడే ఇందులో పూర్తిగా లీనమైపోయాను. తెలుగు ప్రేక్షకులకు కొత్తదనమిచ్చే చిత్రమిది. ప్రతీ క్షణం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఇందులోని సంగీతానికి ఓ సైకలాజికల్‌ అప్రోచ్‌ ఉంటుంది. ‘మల్లెపూల పల్లకి’ పాటను రీక్రియేట్‌ చేసి అందరి అంచనాలను అందుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. ‘విక్రమార్కుడు’ తర్వాత రవితేజ నటించిన వాటిలో నా ఫేవరెట్‌ ‘ఇరుముడి’ చిత్రం. కచ్చితంగా ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తుంది’ అని చెప్పారు

ఇర మ డ క చ ల అవ ర డ ల వస త య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in