ఇరుముడి’ కథ.. దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు
Actor ProfileActor

ఇరుముడి’ కథ.. దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇరుముడి’ కథ.. దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు
Chitrajyothy1 Dec 2026
ఇరుముడి’ కథ.. దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు

మాస్ మహారాజా రవితేజ (Raviteja) కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు భక్తి అంశాలను మేళవిస్తూ దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ (Raviteja) కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు భక్తి అంశాలను మేళవిస్తూ దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌లో రవితేజ అయ్యప్ప మాలలో కనిపించడంతో సినిమా కథపై సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఈ చిత్రం శబరిమల నేపథ్యంతో సాగుతుందనే ప్రచారం జోరుగా సాగింది. ఈ వార్తలపై దర్శకుడు శివ నిర్వాణ స్పష్టత ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఇరుముడి’ కథకు శబరిమల దేవాలయంతో ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. “సినిమాలో హీరో జీవితంలో 41 రోజుల అయ్యప్ప దీక్ష ఒక ముఖ్యమైన భాగం మాత్రమే. అయ్యప్ప దీక్షలో భక్తులు కఠినమైన నియమాలు పాటిస్తారు. అలవాట్లు, వ్యసనాలకు దూరంగా ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో వ్యసనాలు ఉన్న ఒక వ్యక్తి ఈ దీక్షను తీసుకుంటే అతని జీవితంలో ఎలాంటి సంఘర్షణలు చోటు చేసుకుంటాయి? అనే అంశమే కథలో ప్రధానంగా ఉంటుంది. ఈ 41 రోజుల కాలమే సినిమాకు ప్రధాన బలం. దీక్షకు ముందు హీరో జీవితం ఎలా ఉండేది? దీక్షలో ఉన్న సమయంలో ఏం జరిగింది? అతని జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అనే అంశాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయి. కఠినమైన నియమాలు ఉండటం వల్లే అయ్యప్ప దీక్ష నేపథ్యాన్ని ఎంచుకున్నాం. కానీ ఇది శబరిమల యాత్రకు సంబంధించిన కథ కాదు” అని స్పష్టం చేశారు. రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. Tollywood: సీనియర్ నట, రచయిత కృష్ణేశ్వరరావు మృతి శంకర్ డైరెక్షన్‌లో అజిత్ సినిమా.. వర్కవుట్ అవుతుందా?' Supriya: క్యూట్