ఇరుముడి కథ
Actor ProfileActor

ఇరుముడి కథ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
NTV Telugu2 Dec 2026
ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ

మాస్ మహారాజ రవితేజ హీరోగా మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇరుముడి. ఫ్యామిలి ఎమోషన్ డ్రామాగా తెరకెక్కుతున్నఈ సినిమా అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యంతో వస్తుందేమోనని అభిమానులు భావించారు. అయితే ఈ కథాంశంపై దర్శకుడు శివ నిర్వాణ క్లారిటీ ఇస్తూ ‘ఇరుముడి’ అనేది శబరిమల యాత్రకు లేదా అయ్యప్ప స్వామి దర్శనానం, ఆధ్యాత్మిక భావనతో రూపొందించిన భక్తి చిత్రం కాదని, కథలో అంతకు మించిన ఒక బలమైన డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రాబోతుందట. అయ్యప్ప మాల ధారణలో 41 రోజుల అయ్యప్ప దీక్ష అనేది ఒక ముఖ్యమైన భాగం. ఆ దీక్షకు ముందు హీరో జీవితంలో ఏం జరిగింది? దీక్ష సమయంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అనే అంశాలే కథ ముఖ్యభాగం. అప్పుడు జరిగే సంఘటనలు అత్యంత ఆసక్తికరంగా ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా ఉంటాయి. ఈ సినిమా బేసికల్‌గా ఒక భావోద్వేగపూరితమైన ఫ్యామిలీ డ్రామాగా ప్రారంభమవుతుంది. కానీ కథ ముందుకు సాగుతున్న కొద్దీ ప్రేక్షకులు అస్సలు ఊహించని ఒక కొత్త స్పేస్‌లోకి కథనం సాగుతుంది. నెమ్మదిగా మొదలై, సీట్ అంచున కూర్చోబెట్టే క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా మారి ఆడియన్స్‌కు మైండ్ బెండింగ్ ఫీల్‌ను అందిస్తుంది. కథలో తర్వాత ఏం జరగబోతోందనే క్యూరియాసిటీ ఆద్యంతం ప్రేక్షకుడిని వెంటాడుతూనే ఉంటుంది. పూర్తి సీరియస్‌నెస్‌తో సాగే సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ కథలో లీనం చేస్తాయి. అయితే ఈ ఉత్కంఠభరితమైన మిస్టరీ ప్రయాణం చివరకు ఎంతో అందమైన, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతో ముగుస్తుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు డీప్ ఎమోషన్స్ ఉన్న సినిమాలు కోరుకునే వారికి ‘ఇరుముడి’ ఒక ఫీస్ట్ లా అనిపిస్తుందని’ అన్నారు