ఇరాన్ హిట్ లిస్ట్ లో 13 మంది ప్రపంచ నేతలు.. ట్రంప్
Actor ProfilePolitician

ఇరాన్ హిట్ లిస్ట్ లో 13 మంది ప్రపంచ నేతలు.. ట్రంప్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇరాన్ హిట్ లిస్ట్ లో 13 మంది ప్రపంచ నేతలు.. ట్రంప్, నెతన్యాహు, మెలోనీ
Andhra Jyothy7 Nov 2026
ఇరాన్ హిట్ లిస్ట్ లో 13 మంది ప్రపంచ నేతలు.. ట్రంప్, నెతన్యాహు, మెలోనీ

ఇరాన్‌లో అతివాద వైఖరికి పేరుగాంచిన హమ్‌షహ్రీ పత్రిక ప్రచురించిన ఒక కథనం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇరాన్‌లో అతివాద వైఖరికి పేరుగాంచిన హమ్‌షహ్రీ (Hamshahri) పత్రిక ప్రచురించిన ఒక కథనం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో పాటు మొత్తం 13 మంది విదేశీ రాజకీయ నాయకుల చిత్రాలను ఉంచి, వారిని ప్రతీకార లక్ష్యాలుగా పేర్కొంది. ఈ పరిణామం ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితులను మరింత వేడెక్కించింది (Iran revenge list). ఆ పత్రిక ప్రచురించిన రివేంజ్ లిస్ట్‌లో డొనాల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో పాటు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తదితరుల పేర్లు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరాన్ అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తప్పదనే సందేశంతో ఈ పోస్టర్‌ను ప్రచురించినట్లు తెలుస్తోంది (Donald Trump, Benjamin Netanyahu). ఈ పరిణామం నేపథ్యంలో ఆయా దేశాల భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయని, దౌత్యపరంగా కూడా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయని అంతర్జాతీయ మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి (Iran latest news). మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ జాబితా మరింత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. తనను హత్య చేసేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని ట్రంప్ ఇప్పటికే పలుసార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమిర్ ఖాన్ మూడో వివాహం లవ్ జిహాద్.. మహారాష్ట్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే