ఇరాన్ హిట్ లిస్ట్ లో.. ట్రంప్
Actor ProfilePolitician

ఇరాన్ హిట్ లిస్ట్ లో.. ట్రంప్

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources2
ఇరాన్ హిట్ లిస్ట్ లో ట్రంప్, మెలోని సహా 13 మంది
Oneindia Telugu7 Nov 2026
ఇరాన్ హిట్ లిస్ట్ లో ట్రంప్, మెలోని సహా 13 మంది

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న్ భీకర యుద్ధం మధ్యలో అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం(71) ఆకస్మికంగా కన్నుమూశారు. శనివారం సాయంత్రం స్వల్పంగా అనారోగ్యానికి గురైన సెనేటర్ లిండ్సే గ్రాహం ఆకస్మికంగా మరణించారు. సౌత్ కరోలినా స్టేట్ నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు సెనేటర్‌గా ఉన్న గ్రాహం.. అమెరికా విదేశాంగ విధానంపై ఎక్కువగా ప్రభావం చూపేవారు. అయితే గ్రాహం మరణంపై ఇరాన్‌లోని ప్రధాన వార్తాపత్రికలు తమ మొదటి పేజీలో ఓ కథనాన్ని ప్రచురించి.. అమెరికాకు, దాని మిత్రదేశాలకు బహిరంగ హెచ్చరిక జారీ చేశాయి.ఇరాన్ ప్రముఖ వార్తాపత్రిక అయిన షమ్‌షహ్రీ.. తన మొదటి పేజీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా దేశాల ఉన్నతాధికారులతో కూడా ఓ పెద్ద గ్రాఫిక్‌ను ప్రచురించింది. ఆ గ్రాఫిక్‌తో పాటు ఆకస్మిక మరణానికి సిద్ధంగా ఉండండి అనే శీర్షికను కూడా జతచేసింది. షమ్‌షహ్రీ వార్తాపత్రిక ప్రచురించిన ఈ గ్రాఫిక్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 13 మంది ప్రధాన రాజకీయ, సైనిక నాయకులను లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ మాజీ సర్వోన్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు వీరే కారణమని ఆ పత్రిక పేర్కొంది.ఇరాన్ హిట్ లిస్ట్‌లో ట్రంప్, నెతన్యాహుతో సహా 13 మంది వార్తాపత్రికలో ప్రచురితమైన ఇరాన్ హిట్-లిస్ట్‌లో డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో పాటు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హేగ్సేత్, సెంట్రల్ కమాండ్ కమాండర్ బ్రాడ్ కూపర్, ఇజ్రాయెల్‌లో అమెరికా రాయబారి మైక్ హకబీల పేర్లు ఉన్నాయి. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్, విదేశాంగ మంత్రి గిడియన్ సార్, ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఐయాల్ జమీర్ కూడా జైలు దుస్తులలో చిత్రీకరించబడ్డారు. ఆశ్చర్యకరంగా యూరోపియన్ నాయకులైన ఇటాలియన్ ప్రధాని జార్జియా మెలోని, బ్రిటీష్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ కూడా ఇందులో

ఇరాన్ హిట్ లిస్ట్ లో.. ట్రంప్, నెతన్యాహు, మెలోనీ
Eenadu6 Nov 2026
ఇరాన్ హిట్ లిస్ట్ లో.. ట్రంప్, నెతన్యాహు, మెలోనీ

ఇంటర్నెట్‌డెస్క్‌: పశ్చిమాసియాలో యుద్ధం ఆగినట్టే కనిపించినా.. ఇటీవల మళ్లీ ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్, అమెరికా (Iran-USA) పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే హర్మూజ్‌లో ప్రయాణిస్తోన్న నౌకలపై ఐఆర్‌జీసీ దాడులు చేయడం తాజా ఉద్రిక్తతలకు మరింత ఆజ్యంపోసింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌లోని స్థానిక మీడియా.. 13 మంది విదేశీ నేతల పేర్లతో ఉన్న రివేంజ్‌ లిస్ట్‌ను ప్రచురించడం గమనార్హం. ఆ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సహా పలువురు ఐరోపా నేతల పేర్లు ఉన్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో నాటి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని మొజ్తాబా ఖమేనీ ప్రతిజ్ఞ చేశారు. బాధ్యులైన వారు పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇది తమ దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్ అని.. దానిని కచ్చితంగా నెరవేరుస్తానని అన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రతీకార జాబితా బయటకు రావడం చర్చనీయాంశమైంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు