
అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన సముద్ర రవాణా మార్గం 'హర్మూజ్ జలసంధి' వేదికగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ‘హర్మూజ్’ గుండా సైప్రస్ జెండాతో వెళ్తున్న 'ఎం/వి జిఎఫ్ఎస్ గెలాక్సీ' అనే వాణిజ్య కంటైనర్ నౌకపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) బలగాలు దాడి చేయడంపై అమెరికా తీవ్రంగా స్పందించింది. ఇరాన్ చర్యకు ప్రతికారంగా అమెరికా మిలటరీ శనివారం ఇరాన్‌పై భీకర వైమానిక దాడులకు దిగింది. ఒకే వారంలో ఇరాన్ లక్ష్యాలపై అమెరికా దాడులు చేయడం ఇది మూడోసారి.ఈ దాడులను ధ్రువీకరిస్తూ అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన అధికారిక ప్రకటనను అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ ఎక్స్ వేదికగా రీషేర్ చేశారు. ఇరాన్‌ను తీవ్రంగా హెచ్చరిస్తూ.. "ఇరాన్ చాలా తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దానికి తగిన మూల్యం చెల్లించుకుంటోంది" అని ఆయన రాసుకొచ్చారు.అమెరికా మిలటరీ సమాచారం ప్రకారం.. శనివారం రాత్రి 7:15 గంటలకు సెంట్‌కామ్ దళాలు ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. అంతకుముందు ఇరాన్ బలగాలు అంతర్జాతీయ జలమార్గ నిబంధనలను ఉల్లంఘిస్తూ వాణిజ్య నౌకపై దాడికి తెగబడ్డాయి. అయితే, దీనిపై ఇరాన్ ఐఆర్‌జీసీ నేవీ స్పందిస్తూ.. సదరు కంటైనర్ నౌక అనుమతి లేని మార్గంలో ప్రయాణించిందని, తమ హెచ్చరికలను పదే పదే నిర్లక్ష్యం చేయడం వల్లే తాము దానిని అడ్డుకుని దాడి చేయాల్సి వచ్చిందని సమర్థించుకుంది. మరోవైపు, అంతర్జాతీయ షిప్పింగ్ నిబంధనలను పాటించడానికి ఇరాన్‌కు గతంలోనే అవకాశం ఇచ్చినప్పటికీ అది మళ్లీ విఫలమైందని, అందుకే ఇరాన్ దాడి