
ఇరాన్‌కు సహాయం చేసే కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని దాని మిత్రదేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అలా చేయని పక్షంలో భారీ ఆర్ధిక మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేశారు. ఇంటర్నెట్ డెస్క్: కొంతకాలం నుంచి ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకున్నాయి. వాటిని తగ్గించేందుకు మధ్య మధ్యలో శాంతి చర్చలు జరిగినప్పటికీ అవి సఫలం కాలేదు. ఇదే సమయంలో ఇరాన్, అమెరికా దేశాలు పరస్పరం హెచ్చరికలు చేసుకుంటున్నాయి. తాజాగా ఇరాన్ మిత్ర దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక హెచ్చరికలు జారీ చేశాడు. ఆ దేశానికి సహయం చేస్తే.. భారీగా ఆర్ధిక మూల్యం తప్పదని స్పష్టం చేశాడు. ఇరాన్‌కు సహాయం చేసే కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని దాని మిత్రదేశాలకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ' నా కంటే గొప్ప ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్‌కు నాకంటే గొప్ప అవకాశాన్ని మరెవరూ ఇవ్వలేదు. దాన్ని వారు సద్వినియోగం చేసుకోలేదు. అందుకే నేను ఏ దేశంపైనా కూడా ఇప్పటి వరకు చేపట్టిని అత్యంత కఠిన ఆర్థిక చర్యలు తీసుకుంటున్నాను. దీంతో ఇరాన్ ఊహించని స్థాయిలో ఏకాకిగా మారుతుంది' అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్ లో పేర్కొన్నారు. 'ఏ దేశమైనా తమ ఆర్థిక సంస్థలు, వ్యాపారాలు, విమానాశ్రయాలు లేదా ప్రభుత్వ సంస్థల ద్వారా ఇరాన్‌కు ఏ విధమైన ఆర్థిక సాయానికి అనుమతిస్తే, ఆ దేశం కూడా తీవ్రమైన ఆర్థిక పరిణామాలను ఎదుర్కోక తప్పదు. నేను హెచ్చరిస్తుంది ఏ దేశాలనో పేరు చెప్పలేదు కానీ వారు ఎవరో వారికే తెలుసు. ఇరాన్‌ను ఒంటరి చేసి ఓడించడానికి మన మిత్రదేశాలన్నీ అమెరికాకు మద్దతుగా నిలబడాలి. ఈ ఇప్పటికే ఉన్మాదులు(ఇరాన్) బలహీనపడ్డారు. ఈ చరిత్రాత్మక చర్యలు వారిని, ప్రపంచవ్యాప్తంగా వారు సృష్టించే భయోత్పాత సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇరాన్ వద్ద ఎప్పటికీ అణ్వాయుధం ఉండదు' అని ట్రంప్