ఇమ్రాన్ ఖాన్ కు బిగ్ షాక్
Actor ProfilePolitician

ఇమ్రాన్ ఖాన్ కు బిగ్ షాక్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇమ్రాన్ ఖాన్ కు బిగ్ షాక్
Sakshi12 Jan 2027
ఇమ్రాన్ ఖాన్ కు బిగ్ షాక్

జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్‌ దిగ్గజ క్రికెటర్‌, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను జైలు నుంచి ఆసుపత్రికి తరలించాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ.. పాకిస్థాన్‌ ప్రభుత్వం చివరి నిమిషంలో హైడ్రామాకు దిగింది. దీంతో ఇమ్రాన్‌ ఖాన్‌ వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లే అంశంపై మరోసారి అనిశ్చితి నెలకొంది. మంగళవారం మూడు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఇమ్రాన్‌ ఖాన్‌ను రావల్పిండిలోని అడియాలా జైలు నుంచి ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్‌ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది. రెండు రోజుల్లోగా ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందించాలని జైలు అధికారులను ఆదేశించింది. అంతేకాకుండా.. సెప్టెంబర్‌ 16న కేసు తదుపరి విచారణ జరిగే వరకు ఇమ్రాన్‌ ఖాన్‌ను ఆసుపత్రిలోనే ఉంచేందుకు ధర్మాసనం అనుమతించింది. తొలుత ‘అమలు చేస్తాం’ అన్న ప్రభుత్వం అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే పాకిస్థాన్‌ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి తారిఖ్‌ ఫజల్‌ చౌదరీ భిన్నంగా స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ‘అక్షరాలా, స్ఫూర్తితో అమలు చేస్తాం’ అని ప్రకటించారు. ఇమ్రాన్‌ ఖాన్‌కు ఆయన పార్టీ నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాకపోయినా.. జైలులోనే సాధ్యమైనంత ఉత్తమ వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. అయితే.. సుప్రీం ఆదేశాలపై ప్రభుత్వ సమీక్ష కొద్ది గంటల్లోనే సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గింది. కోర్టు ఉత్తర్వులను పూర్తిగా అమలు చేయడం కాకుండా.. వాటిలో తగిన మార్పులు చేయాలని కోరుతూ సమీక్ష పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు న్యాయశాఖ మంత్రి ఆజమ్‌ నజీర్‌ తరార్‌ ప్రకటించారు. సంబంధిత చట్టాన్ని పరిశీలించిన తర్వాత.. సుప్రీంకోర్టును సమీక్ష పిటిషన్‌ ద్వారా ఆశ్రయించి ఉత్తర్వుల్లో తగిన మార్పులు కోరాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. దీంతో ఇమ్రాన్‌ ఖాన్‌ను ఆసుపత్రికి తరలించాలన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల అమలుపై ఉత్కంఠ నెలకొంది. ‘జైల్లో నరకం చూపిస్తున్నారు’.. ఇదిలా ఉండగా.. ఇమ్రాన్‌ ఖాన్‌ జైలు పరిస్థితులపై ఆయన కుటుంబ

ఇమ ర న ఖ న క బ గ ష క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in