
కామాక్షి భాస్కర్ల.. మంచి ప్రతిభ ఉన్న నటి. గ్లామర్ రోల్స్, కమర్షియల్ సినిమాల వెంట పరిగెత్తకుండా కథా బలమున్న సినిమాలు, ప్రయారిటీ ఉన్న పాత్రలు చేస్తూ రాణిస్తోంది. `పొలిమెర` చిత్రాలతో ఆకట్టుకుంది. పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఆమె `అగధ` చిత్రంతో వస్తోంది. ఈ మూవీ రేపు శుక్రవారం(ఆగస్ట్ 14)న విడుదల కానుంది. ఈ రాత్రి నుంచే ప్రీమియర్స్ పడుతున్నాయి. ఎంఎస్ రాజు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా కామాక్షి భాస్కర్ల మీడియాతో ముచ్చటించింది. ఇటీవల ఈవెంట్‌లో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. అనుష్కతో పోల్చుతూ ప్రశంచిన నేపథ్యంలో దీనిపై మాట్లాడుతూ, ఆనందం వ్యక్తం చేసింది. అంత పెద్ద నిర్మాత తనని అలా పోల్చడం ఆనందంగా అనిపించిందని, మరింత బాధ్యతని పెంచిందన్నారు. సినిమా గురించి, దర్శకుడు ఎంఎస్ రాజు గురించి ఆమె మాట్లాడుతూ, `నాకు ఎం.ఎస్. రాజు గారి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆయన తీసిన వాటిల్లో ‘మనసంతా నువ్వే’ నాకు ఆల్ టైం ఫేవరేట్. ఆయన ‘అగధ’ కోసం ఫోన్ చేయడంతో చాలా సంతోషంగా అనిపించింది. నా ‘పొలిమేర’ చూశానని ఆయన అన్నారు. ఆయన ప్రతీ సినిమాలోని ప్రతీ ఆర్టిస్ట్ పవర్ ఫుల్‌గానే కనిపిస్తారు. రాజు గారు నన్ను పిలిచారంటే కచ్చితంగా ఏదో ఒక కొత్త పాయింట్, ముఖ్యమైన పాత్రే అయి ఉంటుందని అర్థమైంది. పైగా రాజు గారు కావడంతో నేను కూడా వెంటనే ఓకే చెప్పాను. ‘అగధ’ కథ, నా పాత్ర చెప్పిన తర్వాత మరింతగా నచ్చేసింది. మేల్ చేసినప్పుడు మేల్ సెంట్రిక్ సినిమాలు అనరు. కానీ ఫీమేల్ చేస్తే మాత్రం ఫీమేల్ సెంట్రిక్ సినిమా అంటారు. ఇంట్లో మహిళలు మల్టీపుల్ టాస్కులు చేస్తుంటారు. స్క్రీన్ మీద ఫీమేల్ కారెక్టర్స్ ఇండిపెండెంట్‌గా ఎందుకు ఉండకూడదు అని అనుకునేదాన్ని. 2019 నుంచి సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాను. చిన్న చిన్న పాత్రల కోసం ఎన్నో ఆడిషన్స్