
అచ్చ తెలుగమ్మాయి... కానీ తమిళంలో బాగా పేరు తెచ్చుకుంది. ‘మ్యాడ్’తో సక్సెస్ సాధించి... తాజాగా కిరణ్ అబ్బవరం సరసన ‘చెన్నై లవ్‌స్టోరీ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యువ కథానాయిక శ్రీ గౌరీ ప్రియ చెబుతున్న కబుర్లివి. అచ్చ తెలుగమ్మాయి.. కానీ తమిళంలో బాగా పేరు తెచ్చుకుంది. ‘మ్యాడ్’తో సక్సెస్ సాధించి... తాజాగా కిరణ్ అబ్బవరం సరసన ‘చెన్నై లవ్‌స్టోరీ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యువ కథానాయిక శ్రీ గౌరీ ప్రియ చెబుతున్న కబుర్లివి... సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో చదువుతున్నప్పుడు కాలేజ్ ఫెస్ట్ కో-ఆర్డినేటర్‌గా ఉన్నా. ఆ సమయంలో ఒక స్టాల్‌లో మిస్ హైదరాబాద్ కాంపిటేషన్ అప్లికేషన్ చూసి, సరదాగా ఫ్రెండ్స్ అందరం అప్లయ్ చేశాం. మనకు ఛాన్స్ ఎక్కడ వస్తుంది లే అనుకున్నా. కానీ నా ఒక్కదానికి మాత్రమే ఆ కాంపిటేషన్ నుంచి కాల్ వచ్చింది. దాంతో గ్లామర్ రంగం వైపు దృష్టి మళ్లింది. అందాల కిరీటం వెనుక... 2018లో మిస్ హైదరాబాద్ కిరీటం అందుకున్నా. అయితే అప్పటిదాకా నేనొక మామూలు అమ్మాయినే. నాకు హీల్స్ వేసుకోవడం అలవాటు లేదు. ర్యాంప్ వాక్ కోసం హీల్స్ వేసుకొని నడవడం నేర్చుకున్నా. సరిగ్గా పోటీకి నాలుగు రోజుల ముందు జారిపడటంతో కాలికి హెయిర్‌లైన్ ఫ్యాక్చర్ అయ్యింది. నొప్పిని భరిస్తూనే ర్యాంప్ వాక్ చేశా. మిగతా రౌండ్లలో కూడా అవాంతరాలు ఎదురైనా... సమయస్ఫూర్తితో దాటేశా. ఎట్టకేలకు నేను ఊహించని విధంగా టైటిల్ నన్నే వరించింది. ఇప్పటికీ తలుచుకుంటే అదొక సినిమాను తలపిస్తుంది. క్రీడలకు ‘బ్రేక్’ పడింది.. చిన్నప్పటి నుంచే అన్నింట్లోనూ పాల్గొనాలని ఉండేది. గెలుస్తామా? లేదా? అన్నది ముఖ్యం కాదు నావరకు. అందుకే చాలా స్పోర్ట్స్‌లో పాల్గొనేదాన్ని. హై జంప్, లాంగ్ జంప్‌లో జిల్లా స్థాయిదాకావెళ్లాను. అప్పుడే కాలు విరగడం వల్ల స్పోర్ట్స్‌కి తెరపడింది. లేకపోతే క్రీడల్లో మరింత రాణించేదాన్నేమో?! ఆ క్షణాల్ని మర్చిపోలేను.. నేను తెలుగమ్మాయినైనా నాకు ఎక్కువగా గుర్తింపు వచ్చింది తమిళ సినిమాలతోనే. నా