ఇన్ స్టాలో అందాల ఆరబోత
Actor ProfileActor

ఇన్ స్టాలో అందాల ఆరబోత

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema3 Oct 2026
ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

తల్లి అయిన తర్వాత తన సినిమాల ఎంపికలో మార్పు వచ్చిందని నటి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) వెల్లడించారు. ఆమె కుమారుడు నీల్ కి ఇప్పుడు నాలుగేళ్లు. దాంతో ఆమె కొడుకుని దృష్టిలో పెట్టుకొని సినిమాలు ఒప్పుకుంటుంది. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న బాలకృష్ణ కొత్త చిత్రంలో (NBK111) ఆమె ఇప్పుడు కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఆమె ఫస్ట్ లుక్‌ను బట్టి ఈ సినిమాలో గ్లామర్ కంటే హుందాతనానికి ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా గ్లామరస్ పాత్రలకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా అని ప్రశ్నించగా, కాజల్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. “గ్లామర్ పాత్రలు చేయనని నేను ఎప్పుడూ చెప్పలేదు. కానీ తల్లి అయిన తర్వాత నా ఆలోచనా విధానం మారింది. నా కొడుకు పెద్దయ్యాక నా సినిమాలు చూసినప్పుడు అతనికి ఇబ్బందిగా అనిపించకూడదు. అందుకే అలాంటి సినిమాలకే నేను ఓకే చెబుతాను,” అని ఆమె చెప్పారు. కాజల్ వ్యాఖ్యలను బట్టి చూస్తే, గ్లామరస్ పాత్రలను ఆమె పూర్తిగా తిరస్కరించడం లేదు. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో చాలా సెక్సీగా కనిపిస్తూ ఫొటోస్ షేర్ చేస్తున్నారు. ఐతే ఇన్ స్టాగ్రామ్ ఫోటోలు వేరు, పాత్రలు వేరు. సినిమా రోల్స్ విషయంలో ఆమె కొన్ని నియమాలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది

ఇన స ట ల అ ద ల ఆరబ త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in