ఇదో పెద్ద జోక్.. నా ఓటునే తీసేశారు
Actor ProfilePolitician

ఇదో పెద్ద జోక్.. నా ఓటునే తీసేశారు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇదో పెద్ద జోక్.. నా ఓటునే తీసేశారు
AP7AM2 Dec 2026
ఇదో పెద్ద జోక్.. నా ఓటునే తీసేశారు

విలక్షణ నటుడు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై తనదైన శైలిలో విమర్శలు చేసే ప్రకాశ్ రాజ్, తన పేరును బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి తొలగించారని సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలో ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ అంశంపై ఆయన సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు.ఈ విషయంపై ప్రకాశ్ రాజ్ ఒక వీడియో విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. "మిత్రులారా.. మీకో జోక్ చెప్పాలి. బెంగళూరు నియోజకవర్గంలో ఓటు హక్కు కోల్పోయిన 65 లక్షల మందిలో నేను కూడా ఒకడిని. మంచి జోక్ కదా? నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే చదువుకున్నాను, నాటకరంగంలో రాణించాను. మీ అందరికీ తెలిసినట్లుగా, ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా కూడా పోటీ చేశాను" అని ఆవేదన వ్యక్తం చేశారు.తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. "ఇది మంచి జోకే. ఆట మొదలైంది. నా ఓటర్ ఐడీని తిరిగి పొందడానికి ఎలాంటి ప్రక్రియను అనుసరించాలో చూస్తాను. అయితే, మీకు ఓటు వేయని కొందరు పౌరుల ఓటు హక్కును మీ అధికారంతో మీరు అడ్డుకోవచ్చు. కానీ, మిమ్మల్ని అధికారం నుంచి దించే మా శక్తిని మీరు ఆపగలరా? జస్ట్ ఆస్కింగ్" అంటూ పాలకులకు సూటిగా సవాల్ విసిరారు.విద్యార్థులపై దాడిని ఖండించిన ప్రకాశ్ రాజ్ఇదే సమయంలో ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరసన తెలుపుతున్న జేపీఎస్‌సీ, జేఎస్ఎస్‌సీ అభ్యర్థులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్‌ను కూడా ప్రకాశ్ రాజ్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థులపై