
సినిమాల్లో తమ పాత్రల కోసం ఎంత కష్టమైనా పడడానికి సిద్ధపడుతున్నారు కొందరు అందాల నాయికలు. ఈ క్రమంలోనే యాక్షన్ సీక్వెన్స్‌లూ చేయడానికి వెనకాడట్లేదు. అయితే ఇదంత సులభం కాదు.. ఇందుకోసం శరీరాన్ని దృఢంగా, ఫ్లెక్సిబుల్‌గా మార్చుకోవాల్సి ఉంటుంది.... సినిమాల్లో తమ పాత్రల కోసం ఎంత కష్టమైనా పడడానికి సిద్ధపడుతున్నారు కొందరు అందాల నాయికలు. ఈ క్రమంలోనే యాక్షన్ సీక్వెన్స్‌లూ చేయడానికి వెనకాడట్లేదు. అయితే ఇదంత సులభం కాదు.. ఇందుకోసం శరీరాన్ని దృఢంగా, ఫ్లెక్సిబుల్‌గా మార్చుకోవాల్సి ఉంటుంది. కఠినమైన వ్యాయామాలతోనే ఇది సాధ్యపడుతుంది. తాజాగా విడుదలైన ‘ఆల్ఫా’ చిత్రం కోసం తానూ ఎంతో కష్టపడ్డానంటోంది బాలీవుడ్ తార ఆలియా భట్. అధిక తీవ్రత గల వ్యాయామాలు చేస్తూ శారీరక దృఢత్వాన్ని పెంచుకున్నానంటూ.. తాను చేసిన కసరత్తులకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇది వైరలవడంతో పాటు.. వృత్తి పట్ల ఆమెకున్న అంకితభావాన్ని మరోసారి బయటపెట్టింది. పాత్రకు న్యాయం చేయడానికి ఎంత రిస్కైనా సై అంటుంది ఆలియా. తాజాగా విడుదలైన ‘ఆల్ఫా’ చిత్రంతో ఈ విషయాన్ని మరోసారి నిరూపించిందీ బ్యూటీ. ఇందులో గూఢచారి పాత్రలో నటించిన ఆమె.. యాక్షన్ సన్నివేశాల కోసం తన శరీరాన్ని దృఢంగా, ఫ్లెక్సిబుల్‌గా మార్చుకుంది. ఇందుకోసం కఠినమైన వ్యాయామాలు చేశానంటూ ఆ విశేషాల్ని ‘ఆల్ఫా మార్నింగ్ రొటీన్’ పేరుతో ఇన్‌స్టాలో పోస్ట్ చేసిందీ చక్కనమ్మ. ఇంతకీ ఆలియా చేసిన ఆ వ్యాయామాలేంటంటే..! బ్యాండెడ్ స్క్వాట్స్ ఇరువైపులా బరువుల్ని జత చేసిన సన్నటి బ్యాండ్స్‌ని భుజాలపై నుంచి క్రిస్‌క్రాస్‌గా అమర్చుకొని.. స్క్వాట్స్ చేసింది ఆలియా. ఈ వ్యాయామం వల్ల తుంటి, తొడ కండరాలపై ఒత్తిడి పడి అవి దృఢంగా మారతాయి. ఇలా కాకుండా తొడలు లేదా మోకాళ్ల కింది భాగంలో బ్యాండ్‌ని అమర్చుకొని కూడా ఈ స్క్వాట్స్‌ని సాధన చేయచ్చు. ఈ క్రమంలో మన శక్తిమేర బ్యాండ్‌ని సాగదీయడం, మరోవైపు గుంజీలు తీస్తున్నట్లుగా స్క్వాట్స్ చేయడం వల్ల.. నడుం కింది భాగానికి చక్కటి