
స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇండియాలో రూ.400 కోట్ల గ్రాస్ దాటిన ఈ మూవీ రూ.500 కోట్ల క్లబ్‌పై కన్నేసింది. హాలీవుడ్ సినిమాలకు మన దేశంలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మార్వెల్ కామిక్స్, అవేంజర్స్, అవతార్ సిరీస్ లకు మన వాళ్ళు ఇచ్చే ఆదరణ వేరే లెవల్లో ఉంటుంది. అయితే, గడిచిన కొద్ది కాలంగా ఇండియన్ మార్కెట్‌లోనే కాదు, గ్లోబల్ వైడ్‌గా కూడా మార్వెల్ సినిమాలకు క్రేజ్ కాస్త తగ్గుతూ వచ్చింది. కంటెంట్ రొటీన్‌గా మారడంతో అభిమానులు కూడా కొంత నిరాశ చెందారు. కానీ, ఆ డౌన్ అవుతున్న క్రేజ్‌ను ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేస్తూ, రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే (Spider-Man Brand New Day) మూవీ బాక్సాఫీస్ దగ్గర నిజమైన సునామీని సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం, కేవలం పది రోజుల్లోనే అంతర్జాతీయంగా మైండ్ బ్లోయింగ్ రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా గ్లోబల్‌గా 1.2 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాలా 11,000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించి ట్రేడ్ పండితులను సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మార్వెల్ (Marvel) ఈజ్ బ్యాక్ అనిపించేలా ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం చూసి హాలీవుడ్ విశ్లేషకులు కూడా షాక్ అవుతున్నారు. ఇక మన దేశ విషయానికి వస్తే.. మన దేశీ బిగ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా పోటీ ఇస్తోంది ఈ హాలీవుడ్ వండర్. ఇప్పటికే భారతదేశంలో ఈ చిత్రం 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల మార్కును దాటేసింది! ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే, త్వరలోనే 500 కోట్ల భారీ క్లబ్‌లో చేరడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు. రిలీజ్ అయి పది రోజులు గడిచినా, క్రేజ్