ఇదెక్కడి విచిత్రమైన స్టెప్పులు.. లైవ్ మ్యాచ్ లో నోరు వెళ్లబెట్టి
Actor ProfileActor

ఇదెక్కడి విచిత్రమైన స్టెప్పులు.. లైవ్ మ్యాచ్ లో నోరు వెళ్లబెట్టి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇదెక్కడి విచిత్రమైన స్టెప్పులు.. లైవ్ మ్యాచ్ లో నోరు వెళ్లబెట్టి, రెండు చేతులతో ఇలా
TV9 Telugu13 Dec 2026
ఇదెక్కడి విచిత్రమైన స్టెప్పులు.. లైవ్ మ్యాచ్ లో నోరు వెళ్లబెట్టి, రెండు చేతులతో ఇలా

Taskin Ahmed Celebration Video: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో బంగ్లాదేశ్ పేసర్ టాస్కిన్ అహ్మద్ సంచలన వికెట్ తో మెరిశాడు. డేంజరస్ ఆల్‌రౌండర్ కామరాన్ గ్రీన్ ను పెవిలియన్ కు పంపి, ఆ తర్వాత అతను చేసిన వింత సెలబ్రేషన్ మైదానాన్ని ఊపేసింది. ఈ విచిత్ర విన్యాసాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న మొదటి టెస్టు తొలి రోజే తీవ్ర ఉత్కంఠకు తెరలేచింది. డార్విన్ పిచ్ పై మంచి ఊపులో కనిపిస్తున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామరాన్ గ్రీన్ ను అవుట్ చేసిన తర్వాత టాస్కిన్ అహ్మద్ చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్నింగ్స్ 22వ ఓవర్ లో టాస్కిన్ వేసిన బంతిని గ్రీన్ లెగ్ సైడ్ వైపు తిప్పడానికి ప్రయత్నించాడు. అయితే బంతి సరిగ్గా బ్యాట్ కు తగలకుండా గాల్లోకి లేచింది. మిడ్ వికెట్ లో ఉన్న సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ దాన్ని అద్భుతమైన క్యాచ్ గా మలుచుకున్నాడు. గ్రీన్ అవుట్ కాగానే టాస్కిన్ తన నాలుక బయటకు పెట్టి విచిత్రంగా డాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. మిగతా ఆటగాళ్లంతా రహీమ్ వైపు పరుగెత్తగా, టాస్కిన్ మాత్రం ఒంటరిగా చేసిన ఈ సరదా డ్యాన్స్ కెమెరాలో రికార్డై క్షణాల్లో వైరల్ గా మారింది. టాస్ తో పాటు బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కు తొలి సెషన్ లోనే బంగ్లాదేశ్ పేసర్లు ఊహించని షాక్ ఇచ్చారు. పచ్చిక ఉన్న పిచ్ వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకుని హసన్ మహమూద్, టాస్కిన్ అహ్మద్, ఎబాదత్ హుస్సేన్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డారు. ఎలాంటి నష్టం లేకుండా 45 పరుగులు చేసిన ఆస్ట్రేలియాను ఒక్కసారిగా కష్టాల్లోకి నెట్టారు. హసన్ మహమూద్ వరుస ఓవర్లలో వికెట్లు తీసి దెబ్బ కొట్టాడు. లోకల్ హీరో జేక్ వెదర్‌ఆల్డ్ ను 23 పరుగుల వద్ద పెవిలియన్ పంపిన హసన్