తెలంగాణ రక్షణ సేన పేరుతో పార్టీని స్థాపించిన కల్వకుంట్ల కవితకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. కొత్త పార్టీకి సంబంధించిన పేరుపై అభ్యంతరాలు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం కవితకు లేఖ రాసింది. తాజాగా కవిత తరఫున తెలంగాణ రక్షణ సేన ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తమ తెలంగాణ రక్షణ సేన పార్టీకి (ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 సెక్షన్ 29A కింద) గుర్తింపు ఇవ్వాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు పంపించిన లేఖకు ఆమె సమాధానమిచ్చారు. తమ పార్టీ పేరును కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించిందని.. ఈసీ ఆమోదించడంతో తాము సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకున్నామని లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు పార్టీ పేరును మార్చుకోవాలంటే తీవ్ర నష్టం, అన్యాయం చేసినట్లే అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తమ పార్టీ రిజిస్ట్రేషన్‌పై దాదాపు వెయ్యి అభ్యంతరాలు వచ్చాయని తెలిపిందని.. కానీ ఆ అభ్యంతరాలు ఎవరు తెలిపారు.. ఏ విషయాలు ప్రస్తావించారనే వివరాలు మాత్రం ఇవ్వలేదన్నారు కవిత. ఈసీకి వచ్చిన అభ్యంతరాలను తమకు పంపకుంటే.. తాము సమాధానం ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. ఎవరైనా కావాలనే ప్లాన్ ప్రకారం గ్రూపులుగా ఏర్పడి ఇదంతా చేయించారా అనేది తెలియాలంటే తమకు అబ్జెక్షన్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రస్తావించారు. త పార్టీ పేరుపై వచ్చిన అన్ని అభ్యంతరాల కాపీలను ఇవ్వాలని కవిత లేఖలో కోరారు. ఇప్పుడు పేరు మార్చమని చెప్పడం అన్యాయమని.. గతంలో తెలంగాణకు సంబంధించి ఒకే రకమైన పేర్లతో పార్టీలకు గుర్తింపు ఇచ్చారని.. అలాంటప్పుడు తమ పార్టీపై అభ్యంతరాలు ఎందుకుని ప్రశ్నించారు. తమ పార్టీపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, సమాధానం ఇచ్చేందుకు తగిన సమయం ఇచ్చాకే వ్యక్తిగత విచారణకు పిలవాలని లేఖలో కోరారు. ఇటీవల కవిత కొత్తగా స్థాపించిన తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) పార్టీ పేరుపై తమకు భారీగా ఫిర్యాదులు వచ్చాయని కేంద్ర ఎన్నికల సంఘం లేఖ
Actor ProfilePolitician
ఇది అన్యాయం.. 105 నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగురవేశాం.. కవిత లేఖ
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•5 Nov 2026
ఇది అన్యాయం.. 105 నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగురవేశాం.. కవిత లేఖ