ఇట్లు అర్జున’.. థియేటర్లలోకి వచ్చే డేట్ ఫిక్స్
Actor ProfileActor

ఇట్లు అర్జున’.. థియేటర్లలోకి వచ్చే డేట్ ఫిక్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇట్లు అర్జున’.. థియేటర్లలోకి వచ్చే డేట్ ఫిక్స్
Chitrajyothy24 Jan 2027
ఇట్లు అర్జున’.. థియేటర్లలోకి వచ్చే డేట్ ఫిక్స్

దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా మారి ‘వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న సరికొత్త చిత్రం ‘ఇట్లు అర్జున’ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ‘ఛలో’, ‘భీష్మ’ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula) నిర్మాతగా మారి ‘వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న సరికొత్త చిత్రం ‘ఇట్లు అర్జున’ (Itlu Arjuna). ఈ సినిమా ద్వారా అనీష్ (Aniesh) కథానాయకుడిగా పరిచయం అవుతుండగా, నూతన దర్శకుడు మహేష్ ఉప్పల (Mahesh Uppala) మెగాఫోన్ పడుతున్నారు. మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, రెండు మెలోడీ పాటలు ప్రేక్షకుల్లో సినిమాపై మంచి ఆసక్తిని, క్యూరియాసిటీని పెంచేశాయనే విషయం తెలియంది కాదు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ఈ మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘ఇట్లు అర్జున’ చిత్రాన్ని దసరా పండుగ సీజన్ సందర్భంగా అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్ సందర్భంగా విడుదల చేసిన సరికొత్త పోస్టర్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో హీరో అనీష్ స్టైలిష్ లుక్‌లో ఓ భారీ భవనం పైకప్పు నుంచి కిందకు దూకుతూ ఏదో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపించగా, హీరోయిన్ అనస్వర రాజన్ చేతులు కట్టేసి ఉండి తీవ్రమైన భావోద్వేగంతో కనిపిస్తూ కథలోని థ్రిల్‌ను సూచిస్తోంది. లీడ్ పెయిర్ మధ్య ఉన్న ఫ్రెష్ కెమిస్ట్రీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమాలో హీరో అనీష్ వినికిడి, మాటల లోపం ఉన్న (చెవిటి, మూగ) యువకుడి పాత్రలో కనిపించబోతుండటం విశేషం. ఈ సరికొత్త పాత్ర నేపథ్యం కథకు ప్రధాన బలంగా మారనుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, రాజా మహాదేవ్ సినిమాటోగ్రఫీ, కోటి కే