
ఆస్పత్రుల నుంచి తల్లీబిడ్డలను ఇళ్లకు తరలించే సేవలనూ వదలని చంద్రబాబు సర్కార్ ప్రాజెక్ట్ ధర అమాంతం పెంచేసి ప్రజాధనం లూటీ గత ప్రభుత్వం 2022లో ట్రిప్పునకు రూ.895 ఖరారు ఒకే రకం సేవకు ఇప్పుడు రూ.1,640 చెల్లించనున్న బాబు సర్కార్ 83 శాతం అధిక ధరతో ఏటా రూ.15 కోట్ల పైనే ప్రజాధనం లూటీ ప్రతి ట్రిప్పునకు కమీషన్ పొందే డీల్‌తో అస్మదీయ సంస్థకు కాంట్రాక్ట్ కట్టబెట్టిన కీలక ప్రజాప్రతినిధి నేడు రాష్ట్రవ్యాప్తంగా సేవలు ప్రారంభించనున్న కొత్త కాంట్రాక్ట్ సంస్థ నాడు కాంట్రాక్ట్ సంస్థ 500 మారుతి ఈకో వాహనాలను సమకూర్చింది. ప్రతి వాహనంలో ఏసీ, జీపీఎస్ ట్రాకింగ్, ఇతర సౌకర్యాలున్నాయి. ఈ వాహనంలో ప్రభుత్వాస్పత్రి నుంచి తల్లీబిడ్డను ఇంటి దగ్గరకు చేర్చినందుకు ట్రిప్పుకు రూ.895 చొప్పున వైఎస్ జగన్ సర్కార్ చెల్లించింది. నేడు ఇప్పుడు కూడా మారుతి ఈకో వాహనాలే. ఏసీ, జీపీఎస్ ట్రాకింగ్ సహా నాటికీ, నేటికీ వాహనంలోని సౌకర్యాల్లో పెద్ద తేడా కూడా ఏమీ లేదు. ఈ వాహనంలో ప్రభుత్వాస్పత్రి నుంచి తల్లీబిడ్డను ఇంటి దగ్గరకు చేర్చినందుకు ట్రిప్పుకు ఏకంగా రూ.1,640 చొప్పున చంద్రబాబు సర్కార్ ఇవ్వబోతోంది. సాక్షి, అమరావతి: గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో, ఇప్పుడు చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవల స్వరూపం ఏ మాత్రం మారకపోయినా ప్రాజెక్ట్ వ్యయం మాత్రం అమాంతం పెరిగిపోతోంది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం ప్రభుత్వ పెద్దల కమీషన్ దాహమేనని తేటతెల్లం అవుతోంది. అమాంతం కాంట్రాక్ట్ విలువలు పెంచి, జనం సొమ్ము కాంట్రాక్టర్‌లకు మళ్లించి, వారి నుంచి సొమ్ము చేసుకునే క్రమంలో ప్రభుత్వ పెద్దలు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను సైతం వదలడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019లో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను గత వైఎస్ జగన్ ప్రభుత్వం బలోపేతం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 500 బ్రాండ్ న్యూ వాహనాలతో సేవలను విస్తరించింది. ఇందుకోసం 2021లో టెండర్‌లు పిలిచి, ఒక్కో ట్రిప్పుకు