ఇక ఇన్ స్టాగ్రామ్ .. ఫేస్ బుక్ మునుపటిలా ఉండవు
Actor ProfilePolitician

ఇక ఇన్ స్టాగ్రామ్ .. ఫేస్ బుక్ మునుపటిలా ఉండవు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇక ఇన్ స్టాగ్రామ్ .. ఫేస్ బుక్ మునుపటిలా ఉండవు
Sakshi7 Jan 2027
ఇక ఇన్ స్టాగ్రామ్ .. ఫేస్ బుక్ మునుపటిలా ఉండవు

సోషల్‌ మీడియా ఇప్పుడు మన జీవితంలో ఓ భాగమైపోయింది. ఉదయం నిద్రలేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు, రీల్స్‌, వీడియోలు చూస్తూ కాలం గడుపుతున్నాం. అయితే ఇంతగా అలవాటైన ఈ సోషల్‌ మీడియా అనుభవం అతిత్వరలో మారిపోనుందా?.. ఇది వరకులా అది మనకు వినోదం పంచడం సాధ్యం కాదా?. మెటాపై కేసు విచారణలో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. పిల్లలు, టీనేజర్లపై సోషల్‌ మీడియా ప్రభావం, వారి వ్యక్తిగత డేటా రక్షణ అంశాలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. అమెరికాలో మెటా సంస్థకు వ్యతిరేకంగా దాఖలైన కీలక కేసు ఇప్పుడు విచారణ దశకు చేరుకుంది. ఈ కేసులో మెటా ఓడిపోతే.. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఇప్పటివరకు వినియోగదారులకు అత్యంత సాధారణంగా కనిపించే అనేక ఫీచర్లు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. అంతేకాదు, అమెరికాలోని 30 రాష్ట్రాలు కలిసి వేసిన ఈ కేసు మెటాపై ట్రిలియన్‌ డాలర్లకు పైగా ఆర్థిక జరిమానా విధించే పరిస్థితికీ దారితీయొచ్చు కూడా. ఏం జరిగింది? 2023లో అమెరికాలోని 30 రాష్ట్రాలు మెటాపై కేసు దాఖలు చేశాయి. కాలిఫోర్నియా, న్యూయార్క్‌ వంటి కీలక రాష్ట్రాలు కూడా ఇందులో ఉన్నాయి. పిల్లలు, టీనేజర్లను ఆకర్షించేలా ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లను రూపొందించి, వారు ఎక్కువసేపు ఆ ప్లాట్‌ఫామ్‌లలో ఉండేలా చేస్తున్నారని రాష్ట్రాలు ఆరోపించాయి. అంతేకాదు.. చిన్నారుల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఫెడరల్‌, రాష్ట్ర చట్టాలను మెటా ఉల్లంఘించిందని కూడా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా వినియోగదారులను పదేపదే యాప్‌లోకి తిరిగి తీసుకురావడానికి నోటిఫికేషన్లు, సిఫార్సు వ్యవస్థలు, ఆటోప్లే వీడియోలు, అనంతంగా కంటెంట్‌ చూపించే విధానం వంటి ఫీచర్లను ఉపయోగిస్తోందని రాష్ట్రాలు చెబుతున్నాయి. నేటి నుంచే కీలక విచారణ మెటాపై అమెరికా రాష్ట్రాలు దాఖలు చేసిన ఈ కీలక కేసులో ప్రధాన విచారణ నేటి నుంచి(ఆగస్టు 18) ప్రారంభం కానుంది. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో జ్యూరీ ఎదుట వాదనలు జరగనున్నాయి. విచారణ సుమారు

ఇక ఇన స ట గ ర మ ఫ స బ క మ న పట ల ఉ డవ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in