
టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ ఏడాది వరుసగా సినిమాలతో మన ముందుకు రానుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'ది ఇండియా స్టోరీ' ఈ నెలలో విడుదల కానుంది. అలాగే బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తోన్న 'రామాయణం: పార్ట్ 1' ఈ దీపావళికి విడుదల కానుంది. వీటితో పాటు గోపీచంద్ మలినేని- నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఎన్బీకే 111లోనూ కాజల్ కథానాయికగా చేస్తోంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూకు హాజరైన కాజల్ తల్లి అయిన తర్వాత తన సినిమా ఎంపికలు మారాయంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న కాజల్‌కు నీల్ కిచ్లు అనే కుమారుడు ఉన్నాడు. తల్లి అయ్యాక తన బాధ్యత పెరిగిందన్న కాజల్ ఇలా చెప్పుకొచ్చింది.. 'ఇప్పుడు నేను ఏ కొత్త ప్రాజెక్ట్‌ను అంగీకరించే ముందైనా నా కుమారుడి కోణం నుంచి ఆలోచిస్తాను. నా సినిమాలు చూసి వాడు గర్వంగా చెప్పుకోవాలి. అందుకే ఇప్పుడు కథలను ఎంచుకునేటప్పుడు మరింత బాధ్యత, జాగ్రత్త అవసరమవుతున్నాయి' అని కాజల్ చెప్పుకొచ్చింది. ఇక తన తాజా చిత్రం 'ది ఇండియా స్టోరీ' గురించి మాట్లాడిన కాజల్.. ' పురుగుమందుల మాఫియా, అవినీతి, ఆహార కల్తీ చుట్టూ తిరిగే కథే ఈ చిత్రం. మనం ప్రతిరోజూ తినే ఆహారంలో ఏముంది, దాన్ని ఎలా తయారు చేస్తారు అనే దానిపై చేసిన లోతైన పరిశోధన ఆధారంగా ఈ చిత్రాన్ని తీశాం. దీని షూటింగ్ సమయంలో నేను షాక్ అయ్యాను. నేను గుడ్డిగా వాడే ఎన్నో వస్తువులను ఇప్పుడు నా వంటగది నుంచి పారేశాను. ఇప్పుడు నా కొడుకుకి ఏ ఆహారం పెట్టాలి, ఏది పెట్టకూడదు అనే దానిపై నాకు స్పష్టత వచ్చింది. ఇక మా అబ్బాయికి రామాయణం అంటే చాలా ఇష్టం. నేను ఈ సినిమాలో నటిస్తున్నానని వినిచాలా సంతోషించాడు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే, ఈ సినిమాలో రాముడి