ఆ హీరో దేవుడు.. ఎదురుగా కాలు మీద కాలు వేసుకుని కుర్చున్నానని ఏమన్నారంటే.. టాలీవుడ్ సీనియర్ నటుడు
Actor ProfileActor

ఆ హీరో దేవుడు.. ఎదురుగా కాలు మీద కాలు వేసుకుని కుర్చున్నానని ఏమన్నారంటే.. టాలీవుడ్ సీనియర్ నటుడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆ హీరో దేవుడు.. ఎదురుగా కాలు మీద కాలు వేసుకుని కుర్చున్నానని ఏమన్నారంటే.. టాలీవుడ్ సీనియర్ నటుడు
TV9 Telugu7 Dec 2026
ఆ హీరో దేవుడు.. ఎదురుగా కాలు మీద కాలు వేసుకుని కుర్చున్నానని ఏమన్నారంటే.. టాలీవుడ్ సీనియర్ నటుడు

ప్రముఖ నటుడు ప్రసాద్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వెండితెరపై, బుల్లితెరపై నటుడిగా తనదైన ముద్ర వేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ రంగ ప్రవేశం, ఎదుగుదల వెనుక ఉన్న పలు ఆసక్తికర, అనూహ్య సంఘటనలను పంచుకున్నారు. దిగ్గజ నటులు అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణలతో తన వ్యక్తిగత అనుబంధాలను, వృత్తిపరమైన అనుభవాలను వివరించారు. ప్రసాద్ బాబు తన తొలి సినిమా “గీత” ప్రారంభోత్సవం సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు గారితో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. అక్కినేని స్టేజీపైకి వస్తున్న సమయంలో తాను కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నానని, అప్పుడు ఆయన గొప్పతనం తనకు తెలియదని అన్నారు. ఆ తర్వాత భయపడుతూ, తప్పు చేశాననే భావనతో అక్కినేనికి నమస్కారం పెట్టగా, అక్కినేని “ఏయ్! నా దగ్గర ఇలాంటివి ఉండవు. అక్కడ పెట్టుకోండి” అంటూ చమత్కరించారని తెలిపారు. “సార్, మీరంటే గౌరవం. మా కన్నా వయసులో పెద్దోళ్లు. పైగా మీకు వేషాలు కూడా లేవు. నాకు సంవత్సరానికి 10-15 సినిమాలు ఉన్నాయి” అని తాను అన్నానని, ఆ తర్వాత అప్పటి తప్పును సరిదిద్దుకున్నానని చెప్పి అక్కినేనితో స్నేహాన్ని పెంచుకున్నానని ప్రసాద్ బాబు వివరించారు. అప్పటి నుండి అక్కినేని ఆయన్ని “సాధూ” అని పిలుస్తూ కబుర్లు చెప్పడం మొదలుపెట్టారట. ప్రసాద్ బాబు సూపర్ స్టార్ కృష్ణను “దేవుడు” అని తెలిపారు. “కృష్ణుడు వేషం వచ్చినప్పుడు కూడా ప్రసాద్ బాబుని ఏమంటాడు ఏంటి?” అని ఆయన పీఏ మూర్తి అడిగేవాడని ప్రసాద్ బాబు గుర్తు చేసుకున్నారు. కృష్ణతో తన తొలి చిత్రం “దొంగల వేట”లో సైడ్ విలన్ పాత్రలో నటించానని, ఆ రోజు సాయంత్రమే పద్మాలయ నుండి తనకు పిలుపు వచ్చిందని ఆయన తెలిపారు. కృష్ణ దయవల్లే ఆ అవకాశం లభించిందని, ఎవరూ తెలియని తనకు పద్మాలయ వంటి పెద్ద సంస్థ నుండి అవకాశాలు రావడం కృష్ణ చలవేనని స్పష్టం చేశారు