
Andhra Jyothy•12 Dec 2026
ఆ విద్యార్థి కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటాఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లిలో గురువారం పర్యటించారు. నక్కపల్లిలో రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. అనంతరం ఇటీవల మృతిచెందిన విద్యార్థి వరహాలు బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వరహాలు బాబు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆ విద్యార్థి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హోం మంత్రి అనిత భరోసా ఇచ్చారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిల ప్రారంభం