ఆ రెండేళ్లూ నరకం చూశా.. ప్రియుడి మానసిక వేధింపుల
Actor ProfileActor

ఆ రెండేళ్లూ నరకం చూశా.. ప్రియుడి మానసిక వేధింపుల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆ రెండేళ్లూ నరకం చూశా.. ప్రియుడి మానసిక వేధింపులపై ఓపెన్ అయిన అనుపమ.. ఎవరో తెలుసా
Asianet News Telugu13 Dec 2026
ఆ రెండేళ్లూ నరకం చూశా.. ప్రియుడి మానసిక వేధింపులపై ఓపెన్ అయిన అనుపమ.. ఎవరో తెలుసా

సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. పదేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎలాంటి వివాదాలకు చోటు ఇవ్వకుండా కేవలం నటనపైనే దృష్టి పెట్టిన ఈ మలయాళ బ్యూటీ, గత కొంతకాలంగా లవ్ అండ్ బ్రేకప్ రూమర్స్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఒక ప్రముఖ యువ హీరోతో ఆమె ప్రేమాయణం నడిపిందని, ఆ తర్వాత మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారంటూ సినీ వర్గాల్లో అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ రూమర్స్‌పై సైలెంట్‌గా ఉన్న అనుపమ, తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన గత రిలేషన్‌షిప్‌కు సంబంధించిన చేదు అనుభవాలను బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. తన జీవితంలో ఎదురైన ఆ చేదు జ్ఞాపకాల గురించి మాట్లాడిన అనుపమ, గత రెండేళ్ల కాలంలో తాను అనుభవించిన నరకాన్ని పూసగుచ్చినట్లు వివరించింది. తాను ఒక తీవ్రమైన నార్సిసిస్టిక్ అబ్యూజ్ కు గురయ్యానని, ఒక విషపూరితమైన బంధంలో బందీ అయ్యానని వెల్లడించింది. తన మాజీ ప్రియుడు ఒక రోజు 'రెమో'లా ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా ఉంటూ ప్రపంచంలోనే ఉత్తమ వ్యక్తిగా కనిపించేవాడని, కానీ మరుసటి రోజే విక్రమ్ 'అపరిచితుడు' సినిమాలోని క్యారెక్టర్ లాగా అత్యంత దారుణంగా, క్రూరంగా ప్రవర్తించేవాడని గుర్తుచేసుకుంది. మళ్లీ ఆ తర్వాత రోజు చిన్నపిల్లాడిలా ఏడుస్తూ క్షమాపణలు కోరేవాడని, ఈ సైకిల్ నిరంతరం రిపీట్ అయ్యేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రేమ పేరుతో తన జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి, క్రమక్రమంగా తనను పూర్తిగా కంట్రోల్ చేయడం ప్రారంభించాడని అనుపమ తెలిపింది. తాను వేసుకునే దుస్తుల నుంచి, సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల వరకు ప్రతీ విషయాన్ని ఆయనే నియంత్రించేవాడని పేర్కొంది. ఆఖరికి తాను నటిస్తున్న సినిమాల ఎంపికలోనూ, ప్రమోషన్స్‌కు హాజరయ్యే విషయంలోనూ ఆంక్షలు విధించేవాడని చెప్పింది. తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించిన 'డ్రాగన్' సినిమా ప్రమోషన్లకు కూడా ఈ తీవ్రమైన మానసిక ఒత్తిడి