
యావత్తు భారతదేశంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఎటు చూసినా.. మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. చిన్నపెద్ద అనే తారతమ్యం లేకుండా వందేమాతరం.. అంటూ తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ వేడుకలు అన్ని చోట్ల ఆయా రాష్ట్రాల సాంస్కృతులకు అనుగుణంగా జరిగితే..ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో మాత్రం ఓ బుడ్డోడు తన కమనీయ గొంతుతో ఆకట్టుకున్నాడు. ఆ చిన్నారి ఆలపించిన తీరుకి ఆ రాష్ట్రంలోని కమనీయ పర్యాటక ప్రదేశాలపై చర్చకు తెరలేపింది. అదెలాగో చకచక ఇది చదివేయండి మరి.. పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఆ చిన్నారి జాతీయ గీతాన్ని ఆలపించిన వీడియోని షేర్ చేస్తూ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. ఆ వీడియోలో నాగాలాండ్‌కి చెందిన ఐదేళ్ల చిన్నారి యాటో వాంగ్నావో జాతీయ గీతాన్ని చాలా అద్భుతంగా ఆలపించాడు. ఆ చిన్నారి పాట పాడిన తీరు.. ఆ రాష్ట్ర పర్యాటక ప్రదేశాలపై మనసు మళ్లేలా అందర్నీ మత్రముగ్ధుల్ని చేసిందన్నారు. ఆ రాష్ట్రంలో తప్పక చూడాల్సిన పర్యాట ప్రదేశాలు గురించి ట్రావెలింగ్ బకెట్ లిస్ట్‌లో ఎందుకు లేవని ప్రశ్నించారు. కనీసం ఈ చిన్నారి యాటో గాత్రం కారణంగానైననా నాగాలాండ్ పర్యాటక ప్రాంతాలవైపుకి మొగ్గు చూపేలా చేస్తుందంటూ అక్కడి ఆకర్షణీయమైన ప్రదేశాల జాబితా గురించి ప్రస్తావించారు. అంతేగాదు ఈ ఈశాన్య రాష్ట్రం అంటేనే పొగమంచుతో నిండిన పర్వతాలు, అడవులతో నిండిన లోయలు, మారుమూల గ్రామాలు, గిరిజన సముదాయలకు నిలయం. అంతేకాకుండా ప్రతి ఏడాది వేలాదిమంది పర్యాటకులను, ఫోటోగ్రాఫర్లను ఆకర్షించే ప్రసిద్ధ హార్న్‌బిల్ ఉత్సవాన్ని అస్సలు మర్చిపోకూడదు అంటూ తన పోస్ట్‌లో అక్కడ పర్యాట ప్రదేశాల వైభవంగా గురించి రాసుకొచ్చారు. మరి ఈ నేపథ్యంలో నాగాలాండ్ పర్యాటనలో తప్పక చూడాల్సిన పర్యాటక ప్రదేశాలేంటో చూద్దామా..!. కోహిమా, సహజమైన ప్రారంభ స్థానం నాగాలాండ్ కొండ ప్రాంత రాజధాని అయిన కోహిమాతో ప్రయాణం మొదలవుతుంది. ఈ రాష్ట్రం గిరిజన చరిత్ర, రంగురంగుల స్థానిక మార్కెట్లు, ప్రత్యేకమైన వంటకాలు కొన్ని ప్రసిద్ధ గ్రామాలు