ఆంధ్రప్రదేశ్ లో .. అమరావతిలో ఏర్పాటు.. చంద్రబాబు లేఖ
Actor ProfilePolitician

ఆంధ్రప్రదేశ్ లో .. అమరావతిలో ఏర్పాటు.. చంద్రబాబు లేఖ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆంధ్రప్రదేశ్ లో .. అమరావతిలో ఏర్పాటు.. చంద్రబాబు లేఖ
Samayam Telugu19 Oct 2026
ఆంధ్రప్రదేశ్ లో .. అమరావతిలో ఏర్పాటు.. చంద్రబాబు లేఖ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం సాయంతో రైల్వే సహా ఎన్నో ప్రాజెక్టుల్ని అమరావతికి తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు రిక్వెస్ట్ మేరకు కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టులకు అనుమతులు లభించాయి. ఇటీవల కేంద్రం రాజధానిలో రూ.2,534 కోట్ల వ్యయంతో 'సెంట్రల్ సెక్రటేరియట్' (CGO కాంప్లెక్స్), కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాల (GPRA) నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తాజాగా సీఎం చంద్రబాబు కేంద్రానికి మరో కీలక ప్రతిపాదన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌ఆర్‌బీ (రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు)ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రాష్ట్రంలో ఆర్ఆర్‌బీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డును అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌ఆర్‌బీ ఏర్పాటు చేస్తే రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులకు ఊరట దక్కుతుందని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో నైపుణ్యాలు కలిగిన యువత ఉన్నారని, వీరందరికీ రైల్వే ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌‌లో మొత్తం 8,885 కిలోమీటర్ల పొడవున రైల్వే ట్రాక్‌లైన్ ఉందని.. రాష్ట్రం దేశంలోనే ఆరో స్థానంలో ఉందన్నారు. ఏపీలో జూన్ నెలలో విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ కార్యకలాపాలు మొదలయ్యాయని.. రాష్ట్రానికి సంబంధించి రైలు మార్గాలు ఏకంగా ఐదు రైల్వే జోన్ల (దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్‌కోస్ట్ రైల్వ, సదరన్ రైల్వే, సౌత్‌ వెస్ట్‌ రైల్వే) పరిధిలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. దక్షిణ కోస్తా జోన్‌లో గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం డివిజన్లు ఉన్నాయన్నారు. అలాగే రాష్ట్రంలో రైల్వేపరంగా ఉన్న వర్క్‌షాపులు, లోకో షెడ్స్, ట్రాక్ మిషన్ల సెంట్రల్ పీరియాడికల్ ఓవరాలింగ్ డిపో గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో ఇంత రైల్వే నెట్‌వర్క్ ఉందని.. అందుకే ఇక్కడ ఆర్‌ఆర్‌బీ కూడా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ఆర్‌బీ ఏర్పాటైతే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో ఆర్ఆర్‌బీ ఏర్పాటు చేస్తే ఏపీ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వొచ్చంటున్నారు. అలాగే రైల్వేలోల పోస్టుల

ఆ ధ రప రద శ ల అమర వత ల ఏర ప ట చ ద రబ బ ల ఖ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in