అయోధ్య రామమందిరం విరాళాల చోరీ ఆరోపణలపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ స్పందించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన తుది నివేదికను సమర్పించిన అనంతరమే ఈ ఆరోపణలపై పూర్తిస్థాయిలో సమాధానమిస్తానని ఆయన స్పష్టం చేశారు.ఈ మేరకు మంగళవారం రామభక్తులను ఉద్దేశించి ఆయన ఒక లేఖ విడుదల చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మౌనంగా ఉండటమే శ్రేయస్కరమని భావిస్తున్నట్లు తెలిపారు. తన ప్రజా జీవితం ఒక తెరిచిన పుస్తకమని చంపత్ రాయ్ ఆ లేఖలో పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి స్పందిస్తూ, చంపత్ రాయ్‌ను ఆయన నమ్మిన వ్యక్తులే మోసం చేశారని, ఇందులో ట్రస్టీల ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం సిట్ దర్యాప్తు పురోగతిలో ఉందని తెలిపారు. వాస్తవాలను వెలికితీసి, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే హామీ ఇచ్చారు.జూన్ ప్రారంభంలో ఆలయ హుండీ నగదు లెక్కింపులో భారీగా అవకతవకలు జరిగినట్లు వార్తలు వెలువడటంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. సీసీటీవీ నిఘా లోపం, సిబ్బందిపై సరైన తనిఖీలు లేకపోవడం, కొందరు ఉద్యోగులు నగదును దారిమళ్లించడం వంటి అంశాలను సిట్ తన ప్రాథమిక నివేదికలో గుర్తించినట్లు సమాచారం. ఈ క్రమంలో దాదాపు రూ. 7 నుంచి 8 కోట్ల వరకు నిధులు గల్లంతైనట్లు అంచనా వేస్తున్నారు.ట్రస్ట్ సభ్యుడి ఫిర్యాదు మేరకు జూన్ 25న ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నగదు
Actor ProfilePolitician
ఆ తర్వాతే మాట్లాడతానన్న చంపత్ రాయ్
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
AP7AM•6 Oct 2026
ఆ తర్వాతే మాట్లాడతానన్న చంపత్ రాయ్