ఆ జర్నీని ఒక సినిమా తీయొచ్చు
Actor ProfilePolitician

ఆ జర్నీని ఒక సినిమా తీయొచ్చు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆ జర్నీని ఒక సినిమా తీయొచ్చు
Andhra Jyothy30 Oct 2026
ఆ జర్నీని ఒక సినిమా తీయొచ్చు

అచ్చ తెలుగమ్మాయి... కానీ తమిళంలో బాగా పేరు తెచ్చుకుంది. ‘మ్యాడ్‌’తో సక్సెస్‌ సాధించి... తాజాగా కిరణ్‌ అబ్బవరం సరసన ‘చెన్నై లవ్‌స్టోరీ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యువ కథానాయిక శ్రీ గౌరీ ప్రియ చెబుతున్న కబుర్లివి... అనుకోకుండా... సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజీలో చదువుతున్నప్పుడు కాలేజ్‌ ఫె్‌స్ట్‌ కో-ఆర్డినేటర్‌గా ఉన్నా. ఆ సమయంలో ఒక స్టాల్‌లో మిస్‌ హైదరాబాద్‌ కాంపిటేషన్‌ అప్లికేషన్‌ చూసి, సరదాగా ఫ్రెండ్స్‌ అందరం అప్లయ్‌ చేశాం. మనకు ఛాన్స్‌ ఎక్కడ వస్తుంది లే అనుకున్నా. కానీ నా ఒక్కదానికి మాత్రమే ఆ కాంపిటేషన్‌ నుంచి కాల్‌ వచ్చింది. దాంతో గ్లామర్‌ రంగం వైపు దృష్టి మళ్లింది. క్రీడలకు ‘బ్రేక్‌’ పడింది... చిన్నప్పటి నుంచే అన్నింట్లోనూ పాల్గొనాలని ఉండేది. గెలుస్తామా? లేదా? అన్నది ముఖ్యం కాదు నావరకు. అందుకే చాలా స్పోర్ట్స్‌లో పాల్గొనేదాన్ని. హై జంప్‌, లాంగ్‌ జంప్‌లో జిల్లా స్థాయిదాకావెళ్లాను. అప్పుడే కాలు విరగడం వల్ల స్పోర్ట్స్‌కి తెరపడింది. లేకపోతే క్రీడల్లో మరింత రాణించేదాన్నేమో?! ఆ క్షణాల్ని మర్చిపోలేను... నేను తెలుగమ్మాయినైనా నాకు ఎక్కువగా గుర్తింపు వచ్చింది తమిళ సినిమాలతోనే. నా కెరీర్‌లో తొలి ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నది తమిళ సినిమా ‘లవర్‌’కి. ఆ సినిమాకు బెస్ట్‌ డెబ్యూ నటిగా అవార్డు అందుకున్న క్షణాల్ని మర్చిపోలేను. అదొక్కటే కాదు.. ఆ సినిమాకుగాను ఫిల్మ్‌ఫేర్‌, సైమా అవార్డులు నా సంతోషాన్ని రెట్టింపు చేశాయి. సంగీత సాగరంలో... చిన్నప్పుడు అమ్మ పాడే పాటలు విని సంగీతమంటే ఇష్టం ఏర్పడింది. నేను కర్ణాటక సంగీతం నేర్చుకున్నా. అక్కడితో నా సంగీత ప్రయాణం ఆగలేదు. లలిత సంగీతం కూడా నేర్చుకున్నా. జెమినీ టీవీలో ‘బోల్‌ బేబీ బోల్‌’ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నా. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే... తేజ దర్శకత్వంలో వచ్చిన ‘హోరాహోరీ’ సినిమాలో ఒక పాట కూడా పాడాను. అంతేకాదు... రేడియో సిటీ సూపర్‌ సింగర్‌ సీజన్‌ 9 విన్నర్‌ నేనే తెలుసా! శోభారాజ్‌ గారి

ఆ జర న న ఒక స న మ త య చ చ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in