ఆ గొంతు వినిపిస్తూనే ఉంటుంది
Actor ProfilePolitician

ఆ గొంతు వినిపిస్తూనే ఉంటుంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆ గొంతు వినిపిస్తూనే ఉంటుంది
Eenadu7 Nov 2026
ఆ గొంతు వినిపిస్తూనే ఉంటుంది

ఆమె... ఒక్కో పాట... ఓ సిరిమల్లె పరిమళం ఒక్కో రాగం... ఓ వెన్నెల వాన ఒక్కో భావం... ఓ గుండెచప్పుడు ఆమె... గాత్రం... సన్నాయి వాద్యం స్వరం... వేనవేల భావాల సమ్మేళనం కోట్లాది మనసుల్లోని ఆ సంగీత జ్ఞాపకం పేరే ఎస్‌.జానకి. కాలం పరుగెత్తినా... తరాలు మారినా... ఓ వెన్నెల రాత్రిలో... ఎక్కడో ఒకచోట... రేడియో తరంగాల్లోనో, అంతర్జాల అల్గారిథమ్స్‌లోనో... జానకి పాట మళ్లీ మళ్లీ వినిపిస్తూనే ఉంటుంది. ఆ గాన కోకిలతో తమకున్న మధుర జ్ఞాపకాలను ‘వసుంధర’తో పంచుకున్నారీ సంగీత ప్రముఖులు. లెజెండరీ సింగర్‌ జానకమ్మతో నా అనుబంధం చాలా కాలం నాటిది. నాన్న టి.ఎస్‌.రాఘవేంద్ర మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఉన్న రోజుల్లో జానకమ్మ, బాలు గారు, సుశీలమ్మ వంటి ఎందరో మహానుభావులు ఆయన కంపోజిషన్‌లో పాడారు. ఆ తర్వాత ఆయన ఇళయరాజా వద్ద అసిస్టెంట్‌గా చేరినప్పుడు కూడా వారందరికీ పాటలు నేర్పించే బాధ్యత నాన్నదే. అలా చిన్నతనం నుంచే జానకమ్మ గొంతును దగ్గరగా వినే భాగ్యం నాకు దక్కింది. జానకమ్మ తన లైఫ్‌లో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన పాట గురించి చెబుతుండేవారు. ఎల్‌.వైద్యనాథన్‌ గారి సంగీతంలో వచ్చిన కన్నడ సినిమా ‘హైమావతి’లో ఆవిడ పాడిన ‘శివ శివ ఎన్నద నాలిగె ఏకె’ అనే పాట అది. తన కెరియర్‌లోనే అత్యంత కష్టపడి పాడిన పాట ఇదేనని జానకమ్మ చెప్పేవారు. 2006లో ఓరోజు నన్ను ఇంటికి రమ్మని పిలిచి ఓ క్యాసెట్‌ చేతిలో పెట్టారు. ‘నేను చాలా కష్టపడి పాడిన పాట ఇది. ఇందులో ఒక్కో లైన్‌ ఆల్టర్నేటివ్‌గా ఒక్కో రాగంలో వస్తుంది. నేను కన్నుమూసేలోపు ఎవరో ఒకరు ఈ పాటను స్టేజ్‌ మీద పాడుతుంటే వినాలని ఉంది. నువ్వు కచ్చితంగా పాడగలవనే నమ్మకం ఉంది’ అని చెప్పారు. అంత క్లిష్టమైన పాటను పాడగలనా అని మొదట భయపడినా, ఆమె నమ్మకాన్ని నిలబెట్టడానికి రేయింబవళ్లు సాధన చేశా. రవీంద్రభారతిలో జరిగిన సుశీలమ్మ ట్రస్ట్‌ వేడుకలో