
గుర్రం శేఖర్ జీ తెలుగు న్యూస్‌లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రాజకీయ వ్యవహారాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. గతంలో వివిధ మీడియా సంస్థల్లో పని చేశారు. ఆయనకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Kakinada Politics: కాకినాడ జిల్లాలో కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురం, తుని, పెద్దపురం, జగ్గంపేట, పత్తిపాడు నియోజకవర్గాలు ఉన్నాయి. పిఠాపురం నుంచి గెలిచిన పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. అటు కాకినాడ రూరల్ నుంచి జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ఉన్నారు. కాకినాడ సిటీ నుంచి వనమాడి కొండబాబు, తుని నుంచి యనమల దివ్య, పెద్దాపురం నుంచి నిమ్మకాయల చినరాజప్ప, జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ, ప్రత్తిపాడు నుంచి వరుపుల సత్యప్రభ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఓ ఎమ్మెల్యే కుటుంబ పెత్తనం జిల్లాలోనే హాట్ టాపిక్ గా మారిందని ప్రచారం సాగుతోంది. సదరు ఎమ్మెల్యే నియోజకవర్గంలో రాజకీయం చేస్తూనే ప్రతి నెల కొన్ని రోజులు వ్యక్తిగత పనులపై క్యాంపులకు వెళ్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఎమ్మెల్యే క్యాంపులకు ఎందుకు వెళ్తారో చెప్పాలని వైసీపీ నేతలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. క్యాంపులు అంటే అధికార కార్యక్రమాలో కాదు..అటు పార్టీ కోసమో కాదని కేవలం వ్యక్తిగతమని అంటున్నారు. ఆ ఎమ్మెల్యే గారి నోటి దురుసు రాష్ట్రమంతా తెలిసిపోయిందని.. నోరు విప్పితే బండ బూతులేనని, ఎవరినైనా విమర్శించాలంటే ఆ ఎమ్మెల్యే బూతులు తిట్టాల్సిందేనని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.. మరోవైపు ఎమ్మెల్యే గారి అబ్బాయి పంచాయితీ కార్యదర్శి, వీఆర్వో మొదలు నియోజకవర్గంలో పనిచేసే అధికారులు సిబ్బంది బదిలీల వ్యవహారం చూస్తారని తెలుస్తోంది. అలాగే ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఆయన చక్కబెడతారని టాక్. పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న కార్యకర్తలు చెప్పిన విషయాన్నీ కూడా పట్టించుకోకుండా ఏ అధికారిని ఎక్కడ నియమించాలి, ఎవరిని బదిలీ చేయాలి, ఎవరిపై వేటు వేయాలి అని ఆయనే చేస్తారట. నేరుగా ఆయనే జిల్లా