Samayam Telugu•15 Jan 2027
ఆ అమృతం రుచి భట్టి గారికి తెలుసు.. మహేష్ కుమార్ గౌడ్ఆ అమృతం రుచి భట్టి గారికి తెలుసు.. మహేష్‌కుమార్ గౌడ్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సభ జరిగింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బహుజనులు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న రేవంత్‌రెడ్డి మరో ఐదు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ‘‘"ముఖ్యమంత్రి గారు.. మీరు బ్రాందీ, విస్కీ తాగరు. ఒకసారి కల్లు తాగి దాని రుచి చూడండి. కల్లు ఒక అమృతం, ఆ అమృతం గురించి భట్టి గారికి తెలుసు. ఇవాళ కల్లు వృత్తి ఇబ్బందుల్లో ఉంది." అని మహేష్ గౌడ్ అన్నారు. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు అసలు వార్తా మూలంలో అందుబాటులో ఉన్నాయి