ఆసీస్ క్రికెట్ దిగ్గజం స్టీవ్ వాకు ప్రధాని మోదీ అరుదైన కానుక.. 20 ఏళ్ల నాటి జ్ఞాపకం
Actor ProfilePolitician

ఆసీస్ క్రికెట్ దిగ్గజం స్టీవ్ వాకు ప్రధాని మోదీ అరుదైన కానుక.. 20 ఏళ్ల నాటి జ్ఞాపకం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆసీస్ క్రికెట్ దిగ్గజం స్టీవ్ వాకు ప్రధాని మోదీ అరుదైన కానుక.. 20 ఏళ్ల నాటి జ్ఞాపకం
AP7AM23 Oct 2026
ఆసీస్ క్రికెట్ దిగ్గజం స్టీవ్ వాకు ప్రధాని మోదీ అరుదైన కానుక.. 20 ఏళ్ల నాటి జ్ఞాపకం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఆస్ట్రేలియా పర్యటనలో ఆ దేశ క్రికెట్ దిగ్గజం స్టీవ్ వాకు ఓ అరుదైన కానుకను అందజేసి ఆశ్చర్యపరిచారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం తామిద్దరూ తొలిసారి కలుసుకున్నప్పటి మధుర స్మృతిని గుర్తు చేస్తూ, ఆ ఫొటోను ఫ్రేమ్ చేయించి శుక్రవారం ఆయనకు బహూకరించారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)ను సందర్శించిన సందర్భంగా ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్టీవ్ వా ఆయనతో భేటీ అయ్యారు. ఆనాటి స్మృతులను నెమరువేసుకుంటూ ప్రధాని మోదీ అందించిన ఈ వ్యక్తిగత బహుమతికి స్టీవ్ వా మంత్రముగ్ధులయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల ప్రధానులు యువ క్రీడాకారులతో సంభాషించారు. క్రికెట్, కబడ్డీ, ఆస్ట్రేలియన్ ఫుట్‌బాల్ క్రీడల్లో రాణిస్తున్న అథ్లెట్లను వారు ఉత్సాహపరిచారు. ఇదే వేదికపై 'భారత్-ఆస్ట్రేలియా క్రీడా సహకార రోడ్‌మ్యాప్'ను కూడా ఆవిష్కరించారు.ఈ పర్యటన సందర్భంగా క్రికెట్ ప్రేమికులకు మరో తీపి కబురు అందింది. 2026-27 బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) సీజన్ ప్రారంభ మ్యాచ్‌ను చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో నిర్వహించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 12న మెల్‌బోర్న్ రెనెగేడ్స్, పెర్త్ స్కార్చర్స్ జట్ల మధ్య ఈ పోరు సాగనుంది. ఆస్ట్రేలియా గడ్డ వెలుపల బీబీఎల్ మ్యాచ్ నిర్వహించడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం

ఆస స క ర క ట ద గ గజ స ట వ వ క ప రధ న మ ద అర ద న క న క 20 ఏళ ల న ట జ ఞ పక Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in