ఆసిఫాబాద్ గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థిని కళ్లకు గంతలు కట్టి.. బలవంతంగా పెన్ క్యాప్ మింగించిన తోటి
Actor ProfilePolitician

ఆసిఫాబాద్ గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థిని కళ్లకు గంతలు కట్టి.. బలవంతంగా పెన్ క్యాప్ మింగించిన తోటి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆసిఫాబాద్ గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థిని కళ్లకు గంతలు కట్టి.. బలవంతంగా పెన్ క్యాప్ మింగించిన తోటి
Samayam Telugu3 Oct 2026
ఆసిఫాబాద్ గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థిని కళ్లకు గంతలు కట్టి.. బలవంతంగా పెన్ క్యాప్ మింగించిన తోటి

Kagaznagar Ragging Horror : తెలంగాణలోని ఒక ప్రభుత్వ నివాస పాఠశాలలో అత్యంత భయంకరమైన, ఒళ్లు గగుర్పొడిచే ర్యాగింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పరిధిలోని మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఒక బాలికపై తోటి విద్యార్థినులే వికృతమైన రీతిలో రాక్షసత్వానికి ఒడిగట్టారు. బాధితురాలిని గదిలో బంధించి.. కాళ్లు, చేతులు కట్టేసి మరీ.. కళ్లకు గంతలు కట్టి బలవంతంగా పెన్ మూతను గొంతులోకి నొక్కి నీళ్లు పోసి మింగించారు. ఈ అమానుష ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకిత్తిస్తోంది.కళ్లకు గంతలు కట్టి మరీ టార్చర్.. కడుపులోకి వెళ్లిన పెన్ క్యాప్!పోలీసులు, విద్యాశాఖ వర్గాల కథనం ప్రకారం.. కాగజ్‌నగర్ మండల పరిధిలోని దారిగాం రోడ్డులో ఉన్న జ్యోతిబాఫూలే బాలికల గురుకుల పాఠశాలలో జులై 4వ తేదీన ఈ ఘోరం చోటుచేసుకుంది. ఇక్కడ పదో తరగతి చదువుతున్న ఉషా శాంతి అనే విద్యార్థినిని అదే క్లాస్‌కు చెందిన కొందరు తోటి విద్యార్థినులు టార్గెట్ చేశారు. ర్యాగింగ్ పేరిట వికృత చేష్టలకు దిగిన సదరు విద్యార్థినుల బ్యాచ్.. ముందుగా బాలిక కళ్లకు గంతకు కట్టింది. ఆ తర్వాత ఆమె చేతులు, కాళ్లు కదలకుండా గట్టిగా బంధించారు. అంతటితో ఆగకుండా తీవ్రంగా ప్రతిఘటిస్తున్న బాలిక నోట్లో ఒక ప్లాస్టిక్ పెన్ క్యాప్‌ను బలవంతంగా కుక్కారు. అది గొంతు దాటి లోపలికి వెళ్లేలా ఆమె నోట్లో బలవంతంగా నీళ్లు పోసి మింగించారు. అనంతరం తమకేమీ తెలియనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదీ చూడండి: ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. 12 మందిపై కేసు, 6 నెలలు సస్పెండ్స్కానింగ్‌లో బయటపడ్డ అసలు నిజం..పెన్ క్యాప్ కడుపులోకి వెళ్లడంతో.. ఉషా శాంతి తీవ్రమైన కడుపు నొప్పితో విలవిల్లాడింది. విషయం గుర్తించిన హాస్టల్ సిబ్బంది ఆమెను తక్షణమే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు బాలికకు అత్యవసరంగా స్కానింగ్ పరీక్షలు నిర్వహించగా

ఆస ఫ బ ద గ ర క ల ప ఠశ లల ర య గ గ కలకల వ ద య ర థ న కళ లక గ తల కట ట బలవ త గ ప న క య ప మ గ చ న త ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in