ఆసుపత్రికి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ .. వైద్యులు తేల్చింది ఇదే
Actor ProfilePolitician

ఆసుపత్రికి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ .. వైద్యులు తేల్చింది ఇదే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆసుపత్రికి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ .. వైద్యులు తేల్చింది ఇదే
AP7AM25 Jan 2027
ఆసుపత్రికి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ .. వైద్యులు తేల్చింది ఇదే

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని తేల్చారు. దీంతో ఆయన్ను తిరిగి అడియాలా జైలుకు తరలించారు. గురువారం అర్ధరాత్రి కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇమ్రాన్‌ను ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు.ఇమ్రాన్‌ ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రత్యేక వైద్య పరీక్షలు చేయాలని పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు ఆదేశించింది. 48 గంటల్లో ప్రత్యేక ఆసుపత్రికి తరలించాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు.73 ఏళ్ల ఇమ్రాన్‌కు ఆరుగురు నిపుణులైన వైద్యులతో కూడిన బృందం పరీక్షలు చేసింది. రక్తపోటులో హెచ్చుతగ్గులు, గుండె దడ, తలనొప్పి, ఆందోళన వంటి సమస్యలను పరిశీలించారు. కుడి కంటికి గతంలో తలెత్తిన సమస్యపై కూడా పరీక్షలు నిర్వహించారు.పరీక్షల తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాల్సిన అవసరం లేదని తేల్చారు. జైలులోనే ఉండటం సురక్షితమని వైద్య బృందం సూచించింది.ఆసుపత్రి పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఇమ్రాన్‌ రాకపోకల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. పరీక్షలు పూర్తయిన వెంటనే ఆయనను తిరిగి అడియాలా జైలుకు తరలించారు.ఆగస్టు 2023లో అరెస్టైన ఇమ్రాన్‌ ఖాన్‌ వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన ఆరోగ్యం, నిర్బంధం పాకిస్థాన్‌ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారాయి

ఆస పత ర క ప క మ జ ప రధ న ఇమ ర న ఖ న వ ద య ల త ల చ ద ఇద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in