ఆశావహుల జోరు.. బాబు తీరు వేరు
Actor ProfilePolitician

ఆశావహుల జోరు.. బాబు తీరు వేరు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆశావహుల జోరు.. బాబు తీరు వేరు
Sakshi30 Sept 2026
ఆశావహుల జోరు.. బాబు తీరు వేరు

త్వరలో రెండు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవుల భర్తీ ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరుతున్న దేవినేని ఉమ, వంగవీటి రాధా, పిఠాపురం వర్మ రేసులో కర్రోతు బంగార్రాజు, మహాసేన రాజేష్, వర్ల రామయ్య సామాజిక సమీకరణాలు, ఆర్థిక స్థితిని బేరీజు వేస్తున్న చంద్రబాబు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవడానికి తెలుగుదేశం పార్టీలోని సీనియర్లు పలువురు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెలలో ఖాళీ అవుతున్న గవర్నర్‌ నామినేటెడ్‌ కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూటమిలోని టీడీపీకే వెళ్లే అవకాశం ఉండటంతో ఆ పార్టీలోని ఆశావహులు పైరవీలు ముమ్మరం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల కారణంగా టికెట్లు దక్కని వారు, పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పని చేసినా గుర్తింపు దక్కని సీనియర్లు, వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే, చంద్రబాబు మాత్రం వారి ఆర్థిక స్థితిని బేరీజు వేసి, వారికే ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రేసులో ఉన్నది వీరే గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు దక్కని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎమ్మెల్సీ సీటు కోసం చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ నాయకులంతా ఆయనకు వ్యతిరేకంగా ఉండడం మైనస్‌గా మారింది. కృష్ణా జిల్లాలోనే మరో టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ పేరు ఈసారి బలంగా వినిపిస్తోంది. ఈ దఫా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని గతంలోనే చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ఆయన వర్గం నేతలు చెబుతున్నారు. అయితే రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అని చంద్రబాబు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. రాధాను ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఆయన సామాజికవర్గ నేతలు పలువురు వ్యతిరేకిస్తున్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. పరిశీలనలో రాయలసీమ నేతల పేర్లు? రాయలసీమ నుంచి కొందరి పేర్లను కూడా చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు

ఆశ వహ ల జ ర బ బ త ర వ ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in