
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Bonalu Festival: 'బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారు సరే నిధులేవి? హైదరాబాద్‌లో 3,400 ఆలయాలు ఉంటే బోనాల ఉత్సవాలకు రూ.20 కోట్లు విదిలిస్తారా? రంజాన్ పండుగకు మాత్రం రూ.33 కోట్లు విడుదల చేస్తారా? బోనాల ఉత్సవాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు ప్రస్తావిస్తే మతం పేరుతో చిచ్చు పెట్టాలని మాట్లాడతారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ పలు ఆలయాల్లో పూజలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రంజాన్ పండుగకు రూ.33 కోట్లు ఇస్తే...80 శాతం మంది హిందువుల పండుగకు ఇంకెన్ని కోట్లు ఇవ్వాలి. విదేశాలు నిషేధించిన తస్లీమా జమాతే సంస్థ సభకు కూడా కాంగ్రెస్ రూ.2.40 కోట్లు విడుదల చేస్తారా? నేను హిందువుల కోసం బరాబర్ ప్రశ్నిస్తా' అని బండి సంజయ్ ప్రకటించారు. గోమాతను వధిస్తే ప్రశ్నించాలా? వద్దా? అని నిలదీశారు. హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తే ప్రశ్నించాలా? వద్దా? అని ప్రశ్నించారు. 15 నిమిషాల టైమిస్తే హిందువులను నరికి చంపుతానంటే ప్రశ్నించవద్దా? తాను బరాబర్ సనాతన ధర్మం కోసం పని చేస్తానని బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. 'హిందువులంతా జాగృతం కావాలి. హిందువులారా జెన్‌జీలను స్పూర్తిగా తీసుకోండి. ఆకాశంలో రాకెట్లను పంపడమే కాదు హిందూ సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్నారు. జెన్‌జీల తీరు చూస్తుంటే ముచ్చటేస్తోంది' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. 'ఎన్నికలకు