ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత చదువు.. నోటిఫికేషన్ విడుదల
Actor ProfilePolitician

ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత చదువు.. నోటిఫికేషన్ విడుదల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత చదువు.. నోటిఫికేషన్ విడుదల, పూర్తి వివరాలు ఇవే
Samayam Telugu7 Oct 2026
ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత చదువు.. నోటిఫికేషన్ విడుదల, పూర్తి వివరాలు ఇవే

పేద విద్యార్థులకు నిజంగా ఇది గుడ్‌న్యూసే. ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి సహకరించక గొప్ప విద్యాసంస్థల్లో, సీబీఎస్‌ఈ సిలబస్‌లో చదవలేకపోతున్న విద్యార్థులకు జవహర్‌ నవోదయ విద్యాలయాలు అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఆరో తరగతి నుంచి ప్లస్ టూ (ఇంటర్) వరకు ఉచితంగా నాణ్యమైన విద్యను అభ్యసించేలా కేంద్ర ప్రభుత్వం ఈ సదుపాయాన్ని అందిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కాగజ్‌నగర్‌లోని త్రిశూల్‌పహాడ్‌ జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి గానూ ఆరో తరగతిలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 80 సీట్లలో విద్యార్థులను చేర్చుకోవడానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు జులై 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నవంబర్‌ 28న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు.ఈ ప్రవేశ పరీక్షలో సీటు సాధించిన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పూర్తి ఉచిత విద్యాబోధనతో పాటు ఉచిత వసతి లభిస్తుంది. ఇది కో-ఎడ్యుకేషన్ పాఠశాల అయినందున బాలబాలికలకు ప్రత్యేకంగా సురక్షితమైన వసతి సౌకర్యాలు కల్పించారు. ఇక్కడ విద్యతో పాటు క్రీడలు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, నూతన సాంకేతిక అంశాలను జోడించి ఆధునిక పద్ధతుల్లో విద్యను భోదిస్తారు. కాగా, ఈ పాఠశాలలో ప్రవేశానికి విద్యార్థులు కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. అర్హతలు ఇవే.. ప్రస్తుత 2026-27 విద్యాసంవత్సరంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతూ ఉండాలి. అలాగే మూడు, నాలుగు తరగతులు కూడా ఇదే ఉమ్మడి జిల్లాలోనే చదివి ఉండాలి. విద్యార్థుల వయస్సు విషయానికి వస్తే 01-05-2015 నుంచి 31-07-2017 మధ్య కాలంలో జన్మించి ఉండాలి.గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు పెద్దపీట వేస్తూ నవోదయ విద్యాలయాల్లో మొత్తం 80 సీట్లకు గానూ 75 శాతం సీట్లను గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదువుతున్న వారికే కేటాయిస్తారు. మిగిలిన సీట్లలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ

ఆర తరగత న చ ఇ టర వరక ఉచ త చద వ న ట ఫ క షన వ డ దల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in