ఆమె వ్యాఖ్యలు వ్యక్తిగతం .. నన్ను బాధ్యురాలిని చేయొద్దు
Actor ProfilePolitician

ఆమె వ్యాఖ్యలు వ్యక్తిగతం .. నన్ను బాధ్యురాలిని చేయొద్దు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆమె వ్యాఖ్యలు వ్యక్తిగతం .. నన్ను బాధ్యురాలిని చేయొద్దు
Telugu Times26 Jan 2027
ఆమె వ్యాఖ్యలు వ్యక్తిగతం .. నన్ను బాధ్యురాలిని చేయొద్దు

తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీ (డీఏసీ) ఇచ్చిన షోకాజ్ నోటీసులపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) స్పందించారు. ఆమె కుమార్తె సుస్మిత (Sushmita) చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో డీఏసీ ( DAC) వివరణ కోరిన విషయం తెలిసిందే. దీంతో కొండా సురేఖ స్పందిస్తూ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చారు. ఈ మేరకు కమిటీ చైర్మన్ ముల్లు రవి (Mullu Ravi) కి లేఖ రాశారు. నా కుమార్తె వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు. సుస్మిత వ్యాఖ్యల వ్యవహారంలో నా ప్రమేయం లేదని గుర్తించాలి. సుస్మిత వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయడం సరికాదు. నాకు సంబంధం లేని అంశంలో నా వివరణ కోరడం సముచితం కాదు. కాంగ్రెస్ నాయకత్వం, పార్టీ నియామావళిపై నాకు గౌరవముంది. షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలి అని పేర్కొన్నారు