
Motorola Edge 60 Pro Fusion Price: ఫ్లిప్‌కార్ట్ ఫ్రిడమ్ సేల్‌లో భాగంగా రూ.7,374కే Motorola Edge 60 Fusion స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్‌లో భాగంగా ఎక్చేంజ్ ఆఫర్స్‌తో పాటు బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్‌ను వినియోగించి పేమెంట్ చేసేవారికి ఈ తగ్గింపు ధరతో సొంతం చేసుకోవచ్చు. Motorola Edge 60 Pro Fusion Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ (Motorola Edge 60 Fusion) 5G స్మార్ట్‌ఫోన్‌పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఎప్పటి నుంచో ఇలాంటి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు. ఈ ఫ్లిప్‌కార్ట్ ఫ్రిడమ్ సేల్‌లో భాగంగా చీప్ ధరకే ఈ మొబైల్ అందుబాటులో ఉంది. అయితే, దీనిపై ఎలాంటి ఆఫర్స్ లభిస్తున్నాయో, ఫీచర్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ (Motorola Edge 60 Fusion) 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 6.67-అంగుళాల 1.5K pOLED క్వాడ్-కర్వ్డ్ (Quad-Curved) డిస్ప్లేను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అంతేకాకుండా చాలా ప్రత్యేకమైన 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో లభిస్తోంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ యాంటీ-ఫింగర్‌ప్రింట్ కోటింగ్‌తో కూడిన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i (Corning Gorilla Glass 7i) ప్రొటెక్షన్‌ను కూడా కలిగి ఉంటుంది.. ఈ ఫోన్ శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7400 (MediaTek Dimensity 7400) ఆక్టా-కోర్ ప్రాసెసర్‌పై పని చేస్తుంది.. ఇది గేమింగ్‌కు చాలా స్మూత్‌గా పని చేస్తుందని కంపెనీ వెల్లడించింది.. ఈ మొబైల్‌కి సంబంధించిన కెమెరా ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది వెనుక భాగంలో OIS మద్దతుతో 50MP సోనీ LYTIA 700C మెయిన్ కెమెరాతో పాటు 13MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాలతో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది.. అద్భుతమైన సెల్ఫీల కోసం