ఆద్యంతం ఆసక్తికరంగా టీజర్
Actor ProfileActor

ఆద్యంతం ఆసక్తికరంగా టీజర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆద్యంతం ఆసక్తికరంగా టీజర్
Chitrajyothy11 Dec 2026
ఆద్యంతం ఆసక్తికరంగా టీజర్

అక్షయ్ కుమార్, సైఫ్‌ అలీ ఖాన్ 17 సంవత్సరాల తర్వాత కలిసి నటిస్తున్న సినిమా 'హైవాన్'. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా 'హైవాన్'. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ రూపొందిస్తున్న ఈ థ్రిల్లర్ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ బ్యానర్స్ పై వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రెస్టీజియస్ మూవీతో ఫస్ట్ టైమ్ నెగిటివ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు అక్షయ్ కుమార్. ఈ మూవీని సెప్టెంబర్ 11న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్థం చేస్తున్నారు మేకర్స్. బుధవారం 'హైవాన్' మూవీ టీజర్ ను విడుదల చేశారు. ఇది ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ప్రధాన పాత్రధారులు సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్ క్యారెక్టర్స్ ను టీజర్ లో పరిచయం చేశారు. సైఫ్ అలీఖాన్‌ని దివ్యాంగుడి పాత్రలో చూపించడం ఆసక్తి రేపుతోంది. అక్షయ్ కుమార్ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించారు. ఓ భవనంపై నుంచి నోట్ల కట్టలు కిందికి పడటం, ఒకరు గాయాలతో సహాయం కోసం వేచి చూస్తుండటం టీజర్‌లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. డైరెక్టర్ ప్రియదర్శన్ తన మార్క్ థ్రిల్లర్ మూవీని 'హైవాన్‌'లో ప్రేక్షకులకు చూపించబోతున్నట్లు దీనిని చూస్తే అర్థమౌతోంది. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను బొమన్ ఇరానీ, సయామీ ఖేర్, శ్రియ పిల్గాంకర్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ 17 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో కలిసి నటిస్తుండటం విశేషం. ఎన్టీఆర్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స.. హెల్త్ బులిటెన్ విడుదల ఫ్యాన్స్ వద్దా.. జాన్వీ కపూర్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు Jani Master: తప్పులు జరిగాయి.. ద‌య‌చేసి క్ష‌మించండి

ఆద య త ఆసక త కర గ ట జర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in