
ATA: బాల్టిమోర్ వేదికగా జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు జరగనున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 19వ మహాసభలకు సర్వం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 దేశాల నుండి తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ భారీ వేడుకలను నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లోని బాల్టిమోర్ లో నిర్వహిస్తున్నారు. ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన అమెరికాలోనే అత్యంత పురాతనమైన తెలుగు ఆర్గనైజేషన్ ఆటా అని ఆ సంస్థ నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మహాసభల ప్రాముఖ్యత, ఏర్పాట్లు, భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించారు. మహాసభల సన్నాహాలు.. ఆటా బోర్డ్ మీటింగ్ లో బాల్టిమోర్ నగరంలో మహాసభలు నిర్వహించాలని నిర్ణయించిన మరుసటి రోజు నుంచే ఏర్పాట్లు ప్రారంభించామని శరత్ వేముల చెప్పారు. ఈ వేడుకల కోసం అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఉన్న 250 కి పైగా నగరాల నుండి ప్రతినిధులు సంవత్సరం పాటు శ్రమించారని తెలిపారు. ఈ సారి మహాసభల సక్సెస్ కోసం 6 నెలల ముందే 70 ఆహ్వాన కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. సాంస్కృతిక, క్రీడలు, డెకరేషన్ వంటి వివిధ విభాగాల్లో ఆసక్తి ఉన్న దాదాపు 400 మంది సభ్యులతో కూడిన కోర్ టీం గత ఏడాది కాలంగా క్షేత్రస్థాయిలో పని చేస్తోందని వివరించారు. ప్రస్తుతం స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఉండటంతో ముందుకు వస్తున్న వాలంటీర్లను కూడా పెద్ద ఎత్తున ఈ పనుల్లో ఇన్వాల్వ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతిభకు ప్రోత్సాహం.. అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు పిల్లలు తెలుగు సరిగా మాట్లాడలేకపోయినా, పాటలు పాడే విషయానికి వచ్చేసరికి భారత్‌లో ఉన్న సింగర్ల కంటే ఏమాత్రం తీసిపోకుండా అద్భుతంగా పాడుతున్నారని శరత్ వేముల ప్రశంసించారు. అలాంటి లోకల్ టాలెంట్ ను గుర్తించి సరైన కోచింగ్ ఇచ్చి వేదికపైకి తీసుకురావడానికే జుమ్మంది నాదం, సయ్యంది పాదం అనే కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పాటలతో పాటు క్రికెట్