ఆజంఖాన్ ట్రస్ట్ .. వర్సిటీలో ఈడీ సోదాలు
Actor ProfilePolitician

ఆజంఖాన్ ట్రస్ట్ .. వర్సిటీలో ఈడీ సోదాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆజంఖాన్ ట్రస్ట్ .. వర్సిటీలో ఈడీ సోదాలు
Eenadu14 Jan 2027
ఆజంఖాన్ ట్రస్ట్ .. వర్సిటీలో ఈడీ సోదాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ మంత్రి ఆజంఖాన్‌(Azam Khan)కు చెందిన మౌలానా మహమ్మద్‌ అలీ జౌహర్‌ ట్రస్ట్‌, విశ్వవిద్యాలయానికి సంబంధించిన పలు ప్రదేశాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) బుధవారం సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ యాక్ట్‌ (PMLA) కింద నమోదైన కేసులో ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌, సహారన్‌పుర్‌తో పాటు దిల్లీలో మొత్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. లఖ్‌నవూ కేంద్రంగా పనిచేసే ఈ ట్రస్ట్‌కు ఆజంఖాన్‌ ప్రధాన ట్రస్టీగా ఉండగా, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు భాగస్వాములుగా ఉన్నారు. సోదాల్లో ఇప్పటివరకు ఏమైనా కీలక ఆధారాలు లభించాయా? అనే విషయాన్ని ఈడీ వెల్లడించలేదు. ప్రభుత్వ కాంట్రాక్టుల ద్వారా వచ్చిన నిధులను కొంతమంది ప్రైవేట్ కాంట్రాక్టర్ల సహాయంతో ట్రస్ట్, విశ్వవిద్యాలయం ఆస్తుల నిర్మాణానికి అక్రమంగా మళ్లించారనే ఆరోపణలపై ఈ దర్యాప్తు జరుగుతోంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు