ఆగస్టు 15.. ప్రతి ఇంటి
Actor ProfilePolitician

ఆగస్టు 15.. ప్రతి ఇంటి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆగస్టు 15.. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయండి
Zee Telugu25 Nov 2026
ఆగస్టు 15.. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయండి

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Har Ghar Tiranga 2026: ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'హర్ ఘర్ తిరంగా' అభియాన్ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా విజయవంతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపు ఇచ్చారు. అందులో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేలా బీజేపీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ ప్రోగ్రాం పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్ లోని తన నివాసం వద్ద జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. దేశవ్యాప్తంగా 'హర్ ఘర్ తిరంగా' అభియాన్ ప్రోగ్రామ్‌లు నేటి నుంచి “హర్ ఘర్ తిరంగా అభియాన్”కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో 'తిరంగా యాత్ర'లను విజయవంతంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు బండి సంజయ్ కోరారు. కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రతి భారతీయుడు, విద్యార్థులు పెద్ద ఎత్తున భాగస్వామ్యమై స్వచ్ఛందంగా తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశంపై తమకున్న భక్తిభావాన్ని చాటుకోవడానికి ఇది సువర్ణావకాశమని పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందుగా, ఆగస్టు 12 నుంచి 14 వరకు మహాపురుషులు, స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను శుద్ధి చేసి, స్మారక చిహ్నాల చుట్టూ ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని శ్రేణులను కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి కూడలిలో తిరంగా ర్యాలీలు, దేశభక్తి ప్రదర్శనలు, ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, ప్రతి పౌరుడిని మానసికంగా