
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Fee Reimbursement Telangana: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల చెల్లింపు గడువును ఖరారు చేసింది. ఈ ఏడాది పూర్తి మొత్తాన్ని చెల్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. హైకోర్టు నిర్దేశించిన గడువులోగా వీటిని చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం స్పష్టం చేసింది. ఈ ఏడాది తెలంగాణలో మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.10,000 కోట్ల నుంచి రూ.12,000 కోట్ల మధ్యకు చేరాయి. ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలపై ప్రభుత్వం ఇప్పటికే స్పందించింది. ఈ విషయం హైకోర్టుకు చేరింది. ఈ ఏడాదికి సంబంధించిన బకాయిలన్నింటినీ.. ఆగస్టు 15వ తేదీలోగా పూర్తిగా విడుదల చేస్తామని హైకోర్టుకు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. రెండవ, మూడవ, నాల్గవ సంవత్సరం విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తామని పేర్కొంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్లు చెల్లించడం లేదని ఆరోపిస్తూ పలు ఇంజనీరింగ్ కళాశాలలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఇదిలా ఉండగా, పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్లు చెల్లించడం లేదని కోర్టుకు తెలియజేశారు. బకాయి ఉన్న మొత్తం సుమారు రూ. 10,000 కోట్లుగా అంచనా వేసింది. 2023 నుంచి ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని కళాశాల యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. మిగిలిన బకాయిలను కాలక్రమేణా చెల్లించాలని వారు హైకోర్టును అభ్యర్థించారు. గత విచారణలో, జీవో 9లోని నాలుగు నిబంధనలపై షరతులు విధించారు. కొన్ని నిబంధనలపై ఉన్న స్టేను