
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Star Heroine:తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు తక్కువగా వస్తున్నాయనే చర్చ చాలాకాలంగా కొనసాగుతోంది. ప్రతిభ ఉన్నప్పటికీ ఇతర భాషల నుంచి హీరోయిన్లను తీసుకొస్తున్నారనే విమర్శలు వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ వైష్ణవి చైతన్య గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాలపై ఆసక్తితో వైష్ణవి చైతన్య తొలుత షార్ట్ ఫిల్మ్స్, వెబ్‌సిరీస్‌లలో నటించారు. ది సాఫ్ట్‌వేర్ డెవలపర్, అరేరే మానస, మిస్సమ్మ వంటి వెబ్‌సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత టచ్ చేసి చూడు, అల వైకుంఠపురంలో, రంగ్ దే, టక్ జగదీష్, వరుడు కావలెను వంటి చిత్రాల్లో నటించారు. అనంతరం బేబీ సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. బేబీ సక్సెస్‌మీట్‌లో వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావని చెబుతున్న మాటలను విని చాలామంది ప్రయత్నించకుండానే వెనక్కి తగ్గుతున్నారని అన్నారు. అయితే ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తేనే అవకాశాలు వస్తాయా లేదా అనేది తెలుస్తుందని చెప్పారు. తనకు రాజేశ్, ఎస్‌కేఎన్ వంటి వ్యక్తులు అవకాశం ఇచ్చినట్లే ప్రతి ఒక్కరికీ సరైన సమయంలో అవకాశాలు లభిస్తాయని తెలిపారు. సినీ రంగంలోకి రావాలనుకునే అమ్మాయిలు తమ ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదని వైష్ణవి సూచించారు. కొందరికి అవకాశాలు త్వరగా రావచ్చని, మరికొందరికి కొంత సమయం పట్టవచ్చని చెప్పారు. ఓపికగా ప్రయత్నిస్తే అవకాశాలు తప్పకుండా లభిస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం వైష్ణవి చైతన్య ఎపిక్ అనే సినిమాలో నటిస్తున్నారు. కథకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను